హైదరాబాద్లోని నారాయణగూడ చౌరస్తాలో.. పోలీసులు రూ. 8కోట్ల రూపాయలను పట్టుకున్నారు. ఇదేదో హవాలా వ్యాపారుల సొమ్ము అనుకుంటే.. పెద్దగా విశేషం అయ్యేది కాదు.. ఎన్నికల సమయంలో.. ఇలాంటి కోటానుకోట్లు పట్టుబడుతూంటాయి. కానీ.. అసలు విశేషం.. ఈ మొత్తం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ … ఇచ్చిన చెక్కు ద్వారా.. కొంత మంది బీజేపీ సానుభూతి పరులు డ్రా చేసిన సొమ్ము. ఇండియన్ బ్యాంక్ నుంచి డ్రా చేసిన వెంటనే.. కాపు కాసిన పోలీసులు పట్టుకున్నారు. మామూలుగా అయితే.. రూ. 2 లక్షల కన్నా.. ఎక్కువ సొమ్ము… డిపాజిట్ చేయడం కానీ.. డ్రా చేయడం కానీ.. అంత తేలికగా సాధ్యమయ్యే పని కాదు. పేరు గొప్ప.. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు తర్వాత అనేక నిబంధనలు అమలులోకి తెచ్చింది. కానీ ఏవీ… ఎక్కడా.. అమలు కావడం లేదు. మిగతా వారి సంగతేమో కానీ.. బీజేపీ విషయంలోనే అర్థం కావడం లేదు.
నగదు రహిత లావాదేవీల కోసం.. కష్టపడుతున్న బీజేపీ… ఏకంగా.. రూ. 8కోట్ల లావాదేవీలను.. నగదు రూపంలో చేయడానికి ఒక్క సారిగా డ్రా చేసింది. ఎన్నికల సమయంలో.. ఈ మొత్తం… ఓటర్లకు పంచడానికేనని.. అందుకే … తప్ప.. ఇంత పెద్ద మొత్తం డ్రా చేయాల్సిన అవసరమే లేదని… రాజకీయవర్గాలు చెబుతున్నాయి. బహిరంగసభల ఏర్పాట్లు ఇతర.. ఖర్చులు ఏవైనా… చెక్కులు ద్వారానే సాగుతాయి. నగదు లావాదేవీలు ఉండవు. కార్యాలయాల్లో టీ, కాఫీల ఖర్చుల కోసం… మహా అయితే లక్ష డ్రా చేస్తారేమో కానీ.. కోట్లకు కోట్లు డ్రా చేయరు. ఈ వ్యవహారం అంతా పూర్తిగా.. బ్యాంక్ అధికారుల ప్రమేయంతోనే నడిచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఎవరి ఆదేశాల ప్రకారం.. ఇంత మొత్తం.. ముందుగా బ్యాంక్ సిబ్బంది రెడీ చేసి ఉంచారు… వారికి ఎవరు ఆదేశాలు ఇచ్చారన్నది.. ఈ కేసులో కీలకంగా మారింది. అవినీతి గురించి.. పదే పదే చెప్పే.. భారతీయ జనతా పార్టీ నేతలు… ఇప్పుడు… రూ. 8 కోట్ల గురించి మాట్లాడటానికి సిద్ధపడటం లేదు. విశేషం ఏమిటంటే.. డబ్బులతో పట్టుబడిన వారిలో ఒకరు హర్ష టోయోటా కంపెనీ ఉంది. ఈ కంపెనీ.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమారుడిది. దీంతో.. ఈ డబ్బుల వెనుక చాలా నెట్ వర్క్ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.