నాగార్జున మాజీ కోడలు తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ ఎలా అయ్యారని బీజేపీ ఎంపీ రఘునందన్ రవు ప్రశ్నించారు. సమంతకు చేనేత తెలియదు, చీర అంటే ఏంటో తెలియదని .. మరి ఎలా బ్రాండ్ అంబాసిడర్ ను చేశారో చెప్పాలన్నారు. ఆ సంబంధాలు ఏంటో వాళ్లే చెప్పాలని.. వాళ్లకు ఆ రంగుల లోకంతో ఉన్న రక్త సంబంధం ఏంటో వాళ్లు చెబితేనే బాగుంటుందని ఓ ఇంటర్యూలో ఆయన చెప్పిన వీడియో వైరల్ అవుతోంది.
కొన్నాళ్ల క్రితం సమంతను చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. అప్పటికీ నాగ చైతన్యతో ఆమెకు డైవోర్స్ కాలేదు. అయితే పెద్దగా చేనేతల కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భాలు లేవు. సమంతను నియమించినప్పుడు కొంత మంది విమర్శలు చేసినా వాటికి పెద్దగా ప్రచారం దక్కలేదు. ఆ తర్వాత అంతా మర్చిపోయారు. ఇప్పుడు కొండా సురేఖ వ్యాఖ్యలతో వివాదం ప్రారంభమైన తర్వాత రఘునందన్ రావు ఈ అంశంపై స్పందించారు. దీనికి బీఆర్ెస్ వైపు నుంచి ఆన్సర్ వస్తుందో లేదో కానీ.. ఆయన ఓ రాయి అయితే వేశారని అనుకోవచ్చు.
సమంత మొదటి సినిమా ఏ మాయ చేశావో . అందులో సినిమా మొత్తం సమంత చీరల్లోనే ఉంటుంది. బహుశా ఆ స్టైలింగ్ కు ఆమెకు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించి ఉంటారని అప్పట్లో అనుకున్నారు. కానీ ఇంకేవో కారణాలు ఉన్నాయని రఘునందన్ అనుమానిస్తున్నారు. అసలు వివాదం ప్రారంభమవడానికి రఘునందన్ కూడా కారణమే. నూలు పోగుల దండ.. కొండా సురేఖ మెళ్లో వేసింది రఘునందనే. ఆ ఫోటోతో బీఆర్ఎస్ సోషల్ మీడియా చేసిన ప్రచారం వల్లనే ఈ రచ్చ అంతా ప్రారంభమయింది.