బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు సీఎం జగన్ను పొగడటం లేదు. ఆ స్థానంలో మమతా బెనర్జీని తెచ్చారు. సందర్భం ఉన్నా లేకపోయినా మమతా బెనర్జీ ప్రస్తావన తెచ్చి తెగ పొగిడేస్తున్నారు. ట్వీట్లు చేశారు. దేశంలోని గొప్ప నాయకులలో ఆమె ఒకరని తేల్చేశారు. స్వామి చెప్పిన జాబితాలో మోడీ లేరు. కానీ మమతా బెనర్జీ ఉన్నారు. ఇటీవల ఆమెతో భేటీ కూడా అయ్యారు. ఎందుకు ఈ మార్పు అంటే అందరికీ రాజ్యసభ సీటే కనిపిస్తోంది.
సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ తరపున ఎంపీగా ఉన్నారు. ఆయన పదవి కాలం వచ్చే ఏజాది ప్రారంభంలోనే ముగిసిపోతుంది. ఈ సారి బీజేపీ ఆయనకు కంటిన్యూషన్ ఇచ్చే అవకాశం లేదు. ఆయనకు పదవి ఇచ్చి బీజేపీ సొంతంగా సాధించుకున్నది ఏమీలేదు. పైగా బ్లాక్ మెయిలింగ్ ఎక్కువ. దీంతో ఆయనను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం స్వామి ముందుగానే పసి గట్టి వైసీపీ అధినేత జగన్ ను మంచి చేసుకున్నారు. జగన్ కూడా ఆయనను ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నారు. మీడియా సంస్థలపై కేసులు వేయడానికి కూడా వాడుకున్నారు. ప్రత్యేక విమానాల్లో వచ్చి జగన్తో భేటీ జరిపి వెళ్లేవారు .
అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి కూడా క్లారిటీ లేదో లేకపోతే.. ఎందుకైనా మమంచిదని అనుకున్నారో కానీ ఇప్పుడు మమతా బెనర్జీని కాకా పడుతున్నారు. మమతా బెనర్జీ రాజ్యసభకు పంపుతానని హామీ ఇచ్చారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇది స్వామికి మరింతగా ఉత్సాహం కల్పిస్తోంది. కేంద్రాన్ని విమర్శిస్తూ ట్వీట్ల దాడి పెంచుతున్నారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి విషయంలో స్వామికి కాస్త క్లారిటీ వచ్చి ఉండాలి లేదా… జగన్కు క్లారిటీ వచ్చి ఉండాలని .. స్వామి గురించి చర్చల్లో ఢిల్లీలో సెటైర్లు పడుతున్నాయి.