బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రచారం జరిగింది. కానీ అధికారిక ప్రకటన రాలేదు. కానీ అలాంటిదేమీ లేదని ఎవరూ ప్రకటించడం లేదు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతల్లో ఏకాభిప్రాయం కోసం హైకమాండ్ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీతో ఎలాంటి సంబంధాలు వద్దని ముగ్గురు కీలక ఎంపీలు పట్టుబడుతున్నట్లుగా చెబుతున్నారు. మరో ఇద్దరు ఎంపీలు కొంత మంది కీలక నేతలు ఓకే అంటున్నారు. మిగిలిన వారు హైకమాండ్ కు వదిలేశారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీతో విలీనం చేసుకున్నా.. పొత్తులు పెట్టుకున్నా అది బీజేపీకి నష్టం చేస్తుందని ముగ్గురు ఎంపీలు వారు వాదిస్తున్నారు. బీఆర్ఎస్ బలహీనపడుతోందని ఆ పార్టీ ఓటు బ్యాంక్ క్రమంగా బీజేపీకి దగ్గరవుతోందని .. వారితో పొత్తులు లేదా విలీనం అనే రాజకీయ పరిణామాలు సంభవిస్తే.. అది బీజేపీకి మైనస్ అవుతుందని వారు హైకమాండ్ కు చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి గ్రౌండ్ లెవల్లో క్యాడర్ ఉందని ఆ పార్టీ క్యాడర్ వల్ల బీజేపీ ఆటోమేటిక్ గా బలపడుతుందని చెప్పినట్లుగా తెలుస్తోంది.
రెండు పార్టీలు విలీనం అయితే ..త తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంగతి చూడవచ్చన్న ఆలోచనతో పార్టీ మారాలనుకుంటున్న కొంత మంది నేతల్ని బీఆర్ఎస్ నేతలు ఈ ప్రచారంతో ఆపుతున్నారు. విలీనం ఉండదని తేలితే.. మరికొంత మంది కాంగ్రెస్ గూటికి చేరిపోయే అవకాశం ఉంది.