వైసిపి గడపగడపకు వైఎస్ ఆర్ అంటూ ,ఇంటింటికి తెలుగుదేశం పేరుతో టిడిపి ప్రజల వద్దకు వెళుతుండగా , బిజెపి కూడా ఎపిలో అలాంటి కార్యక్రమం చేపట్టబోతోంది.తమ పార్టీ గుండె,గుండెకి బిజెపి నినాదంతో ప్రజలలోకి వెళ్లబోతున్నామని ఎపి బిజెపి నేత, దేవాదాయ శాఖ మంత్రి మాణి్క్యాలరావు చెప్పారు.ఎపిలో బిజెపిని మరింత అబివృద్ది చేయడానికి ,కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలను చెప్పడానికి తాము ప్రజలలోకి వెళతామని ఆయన అన్నారు.
2014 ఎన్నికల అయిన తర్వాత నుంచీ, స్వంత బలం పెంచుకోవడానికి బిజెపి ప్రయత్నిస్తుండటం తెలిసిందే. అయితే, విభజన హామీలు నెరవేర్చకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా, ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వకుండా, ప్రజల్లోకి వెళ్ళినా ప్రయోజనముండదని, బిజెపి నాయకులు గుర్తించాల్సిన అవసరముంది. ప్రత్యేక హోదా సహా, ఆ విభజన హామీలన్ని తుచ తప్పకుండా నెరివేరిస్తే, ఇంటింటికీ, గడప గడప కి తిరగకుండానే బిజెపి గుండె గుండెకీ చేరే అవకాశముంది. అవి నెరవేర్చకుండా ఎంత తిరిగినా ఏ ప్రయోజనమూ ఉండదు.