సీనియర్ నేత వెంకయ్యనాయుడును రాజస్థాన్ నుంచి, సహాయ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కర్ణాటక నుంచి నామినేట్ చేయాలని బిజెపి చేసిన నిర్ణయం తెలుగుదేశం ప్రభుత్వానికి రాజకీయ సంకేతమే. నిర్మలను ఎపి నుంచి పంపించకపోవచ్చని తెలుగు360లో జనవరిలోనే రాశాను. అయితే ఆ స్థానంలో వెంకయ్యనాయుడును ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుకునే అవకాశం వుందని అప్పుడు అనుకుంటున్నా- ఆయన ఎపి నుంచి వెళ్లడానికి అంతగా ఇష్టపడ్డని సన్నిహితులు చెబుతూ వచ్చారు. మూడు సార్లు కర్ణాటక నుంచి వెళ్లిన వెంకయ్య నాయుడు ఈ దశలో రాజ్యసభ కోసం ఇక్కడకువచ్చాననిపించుకోవడానికి ఇష్టపడరనేది ఒకటైతే ప్రత్యేక హౌదా విషయంలో విమర్శలు ఇరకాటాలు మరో ముఖ్య కారణం. ఇటీవల చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు ఆ తర్వాత కూడా బిజెపి మమ్ముల్ను రాజ్యసభ విషయమై కోరలేదని చెబుతూ వచ్చారు. ఆయన అలా అన్న తర్వాత కూడా రాష్ట్ర లేదా కేంద్ర బిజెపి నేతలు బహిరంగంగా ఎలాటిస్పందన వ్యక్తం చేయలేదు. రాజ్యసభ ప్రకటన వచ్చిన రోజున హెచ్ఎంటివి చర్చలో నేను నిర్మలను పంపించకపోవ్చని అంటే బిజెపి ప్రతినిధి నమ్మలేనట్టు నవ్వారు.కాని ఇప్పుడు అదే జరిగింది.