భారతీయ జనతా పార్టీ వ్యూహం .. జనసేనను ప్లాన్డ్గా..తొక్కేయడమేనని పెద్దగా ఆలోచించకుండా జనసైనికులకు ఆర్థం అవుతోంది. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లను బీజేపీ తెచ్చుకుంది. ఆరు శాతం ఓట్లను వైసీపీ తెచ్చుకుంది. ఈ ఆరు శాతం ఓట్లు గేమ్ ఛేంజర్. ఉత్తరాంధ్రలో.. కోస్తాలో ఫేస్ వాల్యూ లేని జనసేన క్యాండిడేట్లకు కేవలం..పవన్ కల్యాణ్ చరిష్మా వల్ల ఓట్లు వచ్చాయి. అవి వేలల్లో ఉన్నాయి. అనేక మంది తెలుగుదేశం పార్టీ సభ్యుల గెలుపును ఓటమి వరకు తీసుకెళ్లాయి. దానికి ప్రత్యేకంగా విశ్లేషణలు అవసరం లేదు. తెలుగుదేశం పార్టీకి 40 శాతం ఓట్లు వచ్చినా… 23 సీట్లకే పరిమితం కావడానికి జనసేనే ప్రధాన కారణం.
జనసేన తన బలాన్ని గుర్తించిందో లేదో కానీ.. బీజేపీ పంచన చేరడానికి నిర్ణయించుకుంది. దానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటో స్పష్టత లేదు కానీ.. అప్పట్నుండి .. జనసేన బయటకు రాకుండా చేయడంలో బీజేపీ నేతలు సక్సెస్ అయ్యారు. బీజేపీతో పొత్తు ప్రకటన చేయక ముందు పవన్ కల్యాణ్.. అమెరికా రైతులకు మద్దతుగా భారీ మార్చ్ ఫాస్ట్ ప్రకటించారు. కానీ పొత్తు ప్రకటన పెట్టుకున్న తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. అంతకు ముందు ఇసుక సమస్యపై ఉద్యమించారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఏం చేసినా.. కలిసే చేయాలన్న నిబందన కారణం చూపి.. బీజేపీ పవన్ ను సైలెంట్ చేసింది. పవన్ కూడా ఈ ట్రాప్లో పడిపోయారు. సినిమాలు చేసుకుంటూ రాజకీయాల్ని లైట్ తీసుకున్నారు.
ఈ లోపు భారతీయ జనతా పార్టీ పవన్ కల్యాణ్ ను.. సొంతానికి వాడుకుంటూ.. తమ క్యాంపెన్ తాము చేసుకుంటోంది. తిరుపతి లోక్సభ సభ్యుడు చనిపోయిన తర్వాత కనీసం జనసేనతో చర్చించకుండా.. తామే పోటీ చేస్తామని ప్రకటించేసి కార్యాచరణ ప్రకటించేశారు. అక్కడ సంప్రదాయబద్ధంగా.. జనసేన ఉన్న బలాన్ని తమ పార్టీ ఖాతాలో వేసుకుని తాము బలపడ్డాలని చెప్పుకునేందుకు వ్యూహాత్మకంగా ఒత్తిడి చేయడం ప్రారంభించారు. బీజేపీ ఒంటరిగా పోటీచేస్తే.. ఆ పార్టీ బలం అడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి పదిహేను వేల ఓట్లు మాత్రమే. టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు మాత్రం ఓ సారి గెలిచి.. మరోసారి గట్టిపోటీ ఇచ్చింది. కానీ తాము గతంలో గెలిచామని చెప్పుకుని.. జనసేనను.. సైడ్ చేయడానికి ప్రయత్నిస్తోంది.
మిత్రపక్ష పార్టీల్ని మెల్లగా స్వాహా చేయడం.. బీజేపీ శైలి. పెద్ద పెద్ద పార్టీల్నే ఆ పార్టీ కబ్జా చేసేసింది. చివరికి నిర్వీర్యం చేసింది. జనసేనకు ఆ గతి పట్టించడం పెద్ద విషయం కాదు. ఆ దిశగానే సాగుతోంది. కానీ పవన్ కల్యాణ్ అర్థం చేసుకోలేకపోతున్నారు. అర్థం చేసుకుకునే సరికి.. జనసేన నిర్వీర్యం అయిపోతుంది. పవన్ ఫ్యాన్స్ కూడా.. సీరియస్ నెస్ కోల్పోతారు. అంతిమింగా జనసేన ప్లేస్లో బీజేపీ ఉంటుంది.