రాజ్యాంగంలో ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ అనే అంశంపై కొత్త అధ్యాయాన్ని జోడించి, 2029 నాటికి దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించాలని లా కమిషన్ సిఫారసు చేయనుంది. జస్టిస్ రీతు రాజ్ అవస్తీ ఆధ్వర్యంలోని కమిషన్, ఏకకాల ఎన్నికలపై “కొత్త అధ్యాయం, భాగాన్ని” జోడించడానికి రాజ్యాంగంలో సవరణను సిఫారసు చేస్తుందని తెలిపాయి. 19వ లోక్‌సభకు ఎన్నికలు జరగనున్న 2029 మే-జూన్‌లో మొదటి ఏకకాల ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా వచ్చే ఐదేండ్లలో శాసన సభలను మూడు దశల్లో మారుస్తారు.
రాజ్యాంగంలోని కొత్త అధ్యాయంలో లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలు, పంచాయతీలు, మునిసిపాలిటీలకు ఏకకాల ఎన్నికలు , ఏకకాల ఎన్నికల సుస్థిరత , కామన్ ఎలక్టోరల్ రోల్ కు సంబంధించిన అంశాలు ఉంటాయి. మూడు దశల్లో అసెంబ్లీలను జమిలీకి తీసుకు వస్తారు. అసెంబ్లీల కాల పరిమితి మూడు లేదా ఆరు నెలల కాలవ్యవధిని కుదించాల్సిన రాష్ట్రాల అసెంబ్లీలతో మొదటి దశ ఉంటుంది. అవిశ్వాసం కారణంగా ప్రభుత్వం పతనమైతే లేదా హంగ్ ఏర్పడితే, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కూడిన ఐక్య ప్రభుత్వాన్ని రాజ్యాంగాన్ని కమిషన్ సిఫారసు చేస్తుంది. ఐక్య ప్రభుత్వ ఫార్ములా పని చేయని పక్షంలో, మిగిలిన సభ వ్యవధిలో తాజా ఎన్నికలు నిర్వహించాలని లా ప్యానెల్ సిఫారసు చేస్తుంది.
లా కమిషన్‌తో పాటు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఒక ఉన్నత స్థాయి కమిటీ కూడా రాజ్యాంగాన్ని, ప్రస్తుత చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను మార్చడంతో లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలు, మునిసిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు ఎలా నిర్వహించవచ్చనే దానిపై నివేదికను రూపొందిస్తోంది. విపక్షాలు ప్రచారం చేస్తున్నట్లుగా..బీజేపీ గెలిస్తే ఇక ఎన్నికలు ఉండవు అనేది వాస్తవం కాదు.. ఎన్నికలు ఉంటాయి.. కానీ పోటీలో ఒకే పార్టీ ఉంటుందని అనుకోవచ్చు. ఇతర పార్టీలు డమ్మీలయిపోతాయి. అదే జమిలీ ఎన్నికల టార్గెట్.