భారతీయ జనతా పార్టీ .. రెండో సారి బంపర్ మెజార్టీతో గెలిచింది. ఎలా గెలిచిందో.. ఎన్నికల తీరును ఔపాసన పట్టిన వారెవరికీ అర్థం కావడం లేదు. అయితే.. ఇప్పటికీ.. కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి పునాదుల్లేవు. అందుకే.. కొత్త కొత్త దారుల్లో వెళ్లి.. పార్టీని షార్ట్‌కట్‌లో అభివృద్ధి చేసుకోవాలని తపిస్తున్నారు. ఈ షార్ట్ కట్లు అంటే.. ఇతర పార్టీల్లో ఉన్న నేతల్ని లాగేసుకోవడమే…!. ఇప్పుడు.. తెలంగాణలో నేతల్ని.. తర్వాత ఏపీ… లోనూ ఆపరేషన్ ప్రారంభిస్తారన్న ప్రచారం జరుగుోతంది.
“టచ్” .. ది స్పర్శ… ప్రదాని దగ్గర్నుంచే..!
ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోడీ.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీని బెదిరించడానికి… టీఎంసీ ఎమ్మెల్యేలు 40 మంది తనతో టచ్‌లో ఉన్నారని ప్రకటించారు. ఇది అత్యంత దిగువస్థాయి రాజకీయ నేత చేసే ప్రకటన. ప్రధాని స్థాయిలో ఉండి.. ఫిరాయింపులను తాను ప్రొత్సహిస్తానని నేరగా చెప్పారు. అన్నట్లుగానే అక్కడ.. టీఎంసీ నేతలను వరుసగా పార్టీలో చేర్చుకుంటున్నారు. అయితే.. ఎవరూ మనస్ఫూర్తిగా చేరడం లేదని… వారికి రకరకాల బెదిరింపులు వస్తున్నాయనేది బహిరంగరహస్యం. ఎలాగైనా.. పార్టీలో చేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
తెలంగాణ టు మహారాష్ట్ర… వలస ఆపరేషన్లు స్వింగ్..!
మహారాష్ట్రలో… బీజేపీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ నేరుగా.. కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తున్నారు. తమ పార్టీలో చేరాలని.. బేరం పెడుతున్నారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం.. తమ పార్టీలోకి రావాలని.. తాయిలాలు ప్రకటిస్తున్నారు. ఇది … ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలకు తెలిసి… మండిపడ్డారు. కానీ ఇలాంటివాటిని పట్టించుకోవడాన్ని.. బీజేపీ నేతలు మానేశారు. అందుకే బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. మహారాష్ట్రలో త్వరలో భారీగా చేరికలు ఉంటాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే రచ్చ ప్రారంభమయింది. పెద్ద ఎత్తున వలసలంటూ.. ఇప్పటికే ఢిల్లీ నుంచి ప్రచారం చేస్తున్నారు. ఎంత మంది చేరుతారో క్లారిటీ రావాల్సి ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిషా, ఇలా చెప్పుకుంటూ.. పోతే.. భారతీయ జనత పార్టీ.. సామబేదదాన దండోపాయాలను ప్రయోగించి… అన్ని పార్టీల నేతలను తనలో కలుపుకునే ప్రయత్నం చేస్తోంది. దాని కోసం కోట్లకు కోట్లు వెదజల్లుతున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. దేశంలో ఇక ఏ పార్టీ ఉండకూడదన్నట్లుగా బీజేపీ నేతల వ్యవహారశైలి ఉంది. అందుకే… బీజేపీ తీరుపై ప్రజల్లో ఓ రకమైన ఏవగింపు ప్రారంభమవుతోంది.
వలస నేతలు బలమా..? వాపా..?
ఢిల్లీలో 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. బీజేపీ… ఆప్, కాంగ్రెస్ సహా.. అన్ని పార్టీల నేతలను చేర్చేసుకుంది. ఇతర పార్టీలకు.. గట్టి నేతలెవరూ లేరు అనుకున్నారు. కానీ.. అంత మంది చేరినా బీజేపీకి దక్కింది.. మూడు అంటే మూడు అసెంబ్లీ స్థానాలు. బీజేపీ ఆక్రమణపై… ప్రజల్లో వచ్చిన తిరుగుబాటు అది. ఇప్పుడు.. కూడా.. అన్ని రాష్ట్రాల్లో నేతలను భయపెట్టి.. తమ పార్టీలో చేర్చుకుంటే.. అలాంటి తిరుగుబాటే వస్తుంది. అదే జరిగితే… బీజేపీ తుడిచి పెట్టుకుపోతుంది. అదే ప్రజాస్వామ్యం. ప్రజల్ని తక్కువ అంచనా వేస్తే.. అదే చేస్తారన్న విశ్లేషణలు రాజకీయవర్గాల నుంచి వస్తున్నాయి.