తమకు ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో బీజేపీ తేల్చుసుకుంది. గల్లీ స్థాయి రాజకీయాల్ని పక్కన పెడితే ఢిల్లీలో కూడా ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పదవుల ద్వారా స్పష్టత ఇచ్చింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఓ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చైర్మన్ పదవిని ఇచ్చారు ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్. అయితే గతంలో వెంకయ్యనాయుడు ఉన్నప్పుడు కూడా ఆయనకు అవకాశం వచ్చింది. ఇప్పుడూ వచ్చింది. అంటే బీజేపీతో సంబంధాల్లో మార్పు రాలేదన్నమాట.
కానీ ఇప్పుడు వచ్ిచన అసలు మార్పు.. టీఆర్ఎస్ పార్టీకి ఉన్న రెండు పార్లమెంటరీ స్టాండింక్ కమిటీ చైర్మన్ల పదవులు గల్లతు కావడం. ఇటీవలి కాలం వరకూ కేశవరావు , నామా నాగేశ్వరావు పరిశ్రమలశాఖ , లైబ్రరీ కమిటీ చైర్మన్లుగా ఉన్నారు. ఇక ముందు వారు చైర్మన్లుగా వ్యవహరించరు. ఆ పదవులు ఇతర ఎంపీలకు ఇచ్చారు. వారిని కేవలం మెంబర్స్ గా నియమించారు. 16మంది ఎంపీలున్న టిఆర్ఎస్కు స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి దక్కలేదు. ఇంతకు ముందు రెండు చైర్మన్ పదవులు ఇచ్చి.. ఇప్పుడు అసలేమీ ఇవ్వకపోవడం విజయసాయిరెడ్డికి పదవి ఇవ్వడంతో .. బీజేపీ విధానాలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు.
ఢిల్లీలో మొదట్లో టీఆర్ఎస్ కాస్త సానూకలంగానే ఉండేది. రైతు చట్టాలు సహా అన్నింటికీ మద్దతు పలికింది. తర్వాత రాజకీయం మారిపోయింది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ కారమంగా వారిని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పోస్టులకు దూరం పెట్టినట్లుగా భావిస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం బీజేపీతో ఎలాంటి లొల్లి పెట్టుకోలేదు.. కనీసం రాష్ట్రానికి రావాల్సిన వాటిని కూడా అడగడం లేదు. అందుకే ఆ పార్టీకి చైర్మన్ పదవి మళ్లీ ఇచ్చారు.