కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లపై దృష్టి పెట్టిందనే ప్రచారం జరుగుతోంది. బీజేపీకి సిద్ధాంతపరమైన సంస్థగా ఉన్న ఆరెస్సెస్…మొదటి నుంచి రిజర్వేషన్లకు వ్యతిరేకం. మోడీ సర్కార్ అత్యంత వేగంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో… ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలోరిజర్వేషన్లపై శాంతియుత వాతావరణంలో చర్చలు జరగాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న వారి భావాలను అర్థం చేసుకోవాల … వారి ప్రయోజనాలను కూడా ఆలోచించాలని సూచించారు. రిజర్వేషన్లను పునః సమీక్షించాలంటూ గతంలో మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది.
వివిధ విద్యార్థి, కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే అప్పట్లో బీజేపీ ఇంత డైనమిక్ గాలేదు. కానీ ఇప్పుడు.. బీజేపీ దేశంపై .. పార్లమెంట్ పై పూర్తి స్థాయిలో పట్టు సాధించింది. ఈ క్రమంలో మోహన్ భగవత్ మాటలకు.. మద్దతు పెరుగుతోంది. నిజానికి బీజేపీలో..చాలా కాలంగా .. రిజర్వేషన్ల రద్దుపై అంతర్గతంగా చర్చ జరుగుతోంది. గత ఎన్నికలకు ముందు యూపీకి చెందిన కొంత మంది రిజర్వుడు నియోజకవర్గాల ఎంపీలు.. బీజేపీ..రిజర్వేషన్ల రద్దుపై… చర్చ జరుగుతోందని…ఆరోపించారు. కొంత మంది బీఎస్పీలో చేరిపోయారు. నిజంగానే.. ఆరెస్సెస్, బీజేపీలో… ఈ రిజర్వేషన్ల అంశంపై.. చాలా కాలంగా చర్చ జరుగుతోంది.
ఏ విధంగా.. చూసినా… రిజర్వేషన్ల అంశంపై.. ఓసీలు తీవ్ర అసంతృప్తిలో ఉంటారు. రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడితే.. పార్టీలకు అతీతంగా..బీజేపీకి మద్దతు లభిస్తుంది. కానీ ప్రజల మధ్య విభజన రేఖ పెరిగిపోతుంది. ఈ క్రమంలో… బీజేపీ… కశ్మీర్ విషయంలో వేసినట్లుగా సాహసోపేతమైన అడుగు వేస్తుందా.. లేక.. చర్చలతో వచ్చే స్పందనను బట్టి…అడుగులు వేస్తుందా.. అనేది ఆసక్తికరం.