తమ ఫోన్లను ట్యాప్ చేశారని బీజేపీ హైకమాండ్ పెద్దలు గట్టిగా భావిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికల హడావుడి పూర్తయిన వెంటనే.. ఈ కేసు విషయంలో పెద్ద ఎత్తున రచ్చ చేయడానికి బీజేపీ పెద్ద ప్లానే వేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే రెండు సార్లు బీజేపీ పెద్దలు ఈసీని కలిసి .. తెలంగాణ సర్కార్ తమ ఫోన్లను ట్యాప్ చేస్తోందని .. విచారణ చేయించాలని ఫిర్యాదు చేశారు. ఇలా ఫిర్యాదు చేసిన వారిలో తరుణ్ చుగ్ లాంటి పెద్ద నేతలే ఉన్నారు. మరో వైపు ఓ బీజేపీ సానుభూతిపరుడు హైకోర్టులో కేసు విషయంలో ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. నాలుగో తేదీన విాచరణ జరుపుతామని తెలిపింది.
ఫోన్ ట్యాపింగ్‌పై పూర్తి సమాచారం బీజేపీ పెద్దలు సేకరించారని.. ఈ విషయంలో కేసీఆర్ వ్యవహారం మొత్తం బయట పెట్టాలనుకుంటున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్ ఫ్రా కంపెనీ బ్యాంక్ అకౌంట్లను టీఆర్ఎస్ నేతలు యాక్సెస్ చేశారు.త ఎవరెవరికి డబ్బులు పంపారో లెక్క తీశారు. ఇది బయటకు ఎలా తెలిసిందని ఆరా తీస్తున్నారు. ఇది కూడా ట్యాపింగ్ తరహాలో ట్రాక్ చేశారని ఆరోపిస్తున్నారు. వీటన్నింటినీ బయటకు తీసి.. కేీసఆర్ గుట్టు బయటపెడతామని అంటున్నారు. మరో వైపు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో టీఆర్ఎస్ పూర్తిగా సైలెంట్ అయిపోయింది.
దర్యాప్తు కూడా పెద్దగా జరగడంలేదు. ఆ ఫోన్లను ట్యాప్ చేయలేదని వాదించేలా… తానే రికార్డు చేశానని నందు అనే వ్యక్తితో స్టేట్ మెంట్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా గతంలో రేవంత్ రెడ్డి ఇష్యూని ట్రాప్ చేసినప్పుడు .. ట్యాపింగ్ ఇష్యూలో తెలంగాణ సర్కార్ ఇరుక్కోలేదు..కానీ ఈ సారి కేంద్ర ప్రభుత్వ పెద్దలనే టార్గెట్ చేయడంతో వారుఈ విషయాన్ని వదిలే చాన్స్ లేదని అంటున్నారు.