ఇదిగో అరెస్టులే అంటూ హడావుడి చేసిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సైలెంట్ అయిపోయాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం అంతా సైలెంట్ అయిపోయింది. మెల్లగా నిందితులకు బెయిల్స్ కూడా వస్తున్నాయి. ఫామ్ హౌస్ కేసు సీబీఐకి చేరింది..కానీ ఇంకా కేసు టేకప్ చేయలేదు.
ఆరు నెలలు సాధన చేసి మూలనున్న ముసలమ్మను కొట్టినట్లుగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ, ఈడీ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కవిత లాంటి వారిని టార్గెట్ చేశారన ిచెబుతున్నా… ఈడీ , సీబీఐ మాత్రం ఇప్పటి వరకూ వారిపై ఎఫ్ఐఆర్ కానీ చార్జిషీటు దాఖలు చేయడం వంటివి కానీ చేయలేదు.
ఓ నిందితుడి చార్జిషీటులో మాత్రం ఢిల్లి లిక్కర్ పాలసీలో లాభం పొందిన సౌత్ లాబీలో కవిత అసలైన భాగస్వామి అని ఆరోపించారు. అంటే ఈ దిశగా ఈడీ, సీబీఐ వద్ద ఆధారాలు ఉన్నాయని అనుకోవచ్చు. కానీ మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ? ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు మాత్రమే కాదు.. ఎమ్మెల్యేలకు ఎర కేసులోనూ సీబీఐ ఇంకా కదల్లేదు. విచిత్రంగా తెలంగాణ ప్రభుత్వం కూడా అటు హైకోర్టు డివిజన్ బెంచ్ కు అయినా లేదా సుప్రీంకోర్టుకు అయినా అప్పీల్‌కు వెళ్తుందన్న ప్రచారం జరిగింది. అయితే అదీ జరగలేదు. అటు సీబీఐ దూకుడు చూపించ లేదు.. ఇటు బీఆర్ఎస్ కూడా ఈ అంశంపై న్యాయపోరాటానికి ఆసక్తి చూపించడం లేదు. దీం
ఈ మొత్తం వ్యవహారానికి రాజకీయవర్గాలు రెండు కారణాలు చెబుతున్నాయి. అందులో మొదటిది బీఆర్ఎస్, బీజేపీ ఓ అండర్ స్టాండింగ్ కు రావడం. ఇది ఎంత వరకూ నిజమవుతుందో చెప్పలేం కానీ.. రాజకీయాల్లో ఇలా పార్టీల అంతర్గతంగా కొన్ని అంశాలపై సర్దుకుపోవడం కామన్ గానే జరుగుతూ ఉంటుంది. మరో కారణం.. టైమింగ్ చూసి ఎటాక్ చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు వేచి చూస్తూ ఉండటం. రెండు ఆయుధాలు బీజేపీ చేతికి అందిన తర్వాత ఇక రాజీకి ఎందుకు వస్తారన్నది బీజేపీ నేతల వాదన. అయితే ముందు ముందు కూడా ఇంతే సైలెంట్ అయిపోయి..ఇతర అంశాలపై రాజకీయం నడిస్తే.. ఈ అంశంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఓ అండర్ స్టాండింగ్ వచ్చిందనుకోవచ్చు.