ఎన్నికల్లో లబ్ది పొందడానికి…ప్రజల్లో భావోద్వేగం పెంపొందించడానికి బీజేపీ సోషల్ మీడియాను ఎన్ని విధాలుగా వాడుకుందో… కథలు కథలుగా వింటూనే ఉన్నాం. ఈ అంశంలో ఫేస్బుక్, ట్విట్టర్లపై లెక్క లేనన్ని ఆరోపణలు వచ్చాయి. అయితే చేసింది బీజేపీకి అనుకులంగా కాబట్టి…ఆయా సంస్థలకు పోయిందేమీ లేదు.. కాస్త పేరు తప్ప. ఇప్పుడు కూడా మరోస్కాం బయటకు వచ్చింది. 2019 ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా సరోగేట్ అడ్వర్టైజిగ్ పెద్ద ఎత్తున ఫేస్బుక్ వేదికగా జరిగింది. వీటిని ఉద్దేశపుర్వకంగా ఫేస్ బుక్ కట్టడి చేయలేదని ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని పార్లమెంట్‌లోనే ప్రస్తావించిన సోనియా గాంధీ.. ఫేస్‌బుక్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
పాస్ మసాలా, మద్యం ప్రకటనలకు మన దేశంలో అనుమతి లేదు. అందుకే మినరల్ వాటర్ లేకపోతే మరో ఉత్పత్తి పేరుతో ప్రచారం చేసి.. పాన్ మసాలా.. మద్యాన్ని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. దీన్నే సరోగేట్ అడ్వర్టైజింగ్ అంటారు. ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో ప్రచారాలపై ఆంక్షలు ఉన్నాయి. దీంతో బీజేపీ సరోగేట్ అడ్వర్టైజింగ్ వైపు వెళ్లిందని ఆరోపణలు వస్తున్నాయి. న్యూస్ పేరుతో … తమ నేతల ఇమేజ్ పెంచే వార్తలు..,పార్టీపై సదభిప్రాయం ఏర్పడే వార్తలను ప్రచారం చేసుకుందని చెబుతున్నారు. ఈ విషయంలో రిలయన్స్ ఫండింగ్ చేసిన డిజిటల్ మీడియా “న్యూస్ జే” కీలకంగా వ్యవహరించింది.
న్యూస్ జే.. సోషల్ మీడియాలో బాగా ఎదుగుదుతున్న డిజిటల్ మీడియా. ఎక్కువగా ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సైట్లలోనే కనిపిస్తుంది. ఈ సంస్థ ఎన్నికల సమయంలో ఫేస్ బుక్ నుంచి పెద్ద ఎత్తున అడ్వాటైజింగ్ స్పేస్‌ను కొనుగోలు చేసింది. అక్కడ బీజేపీ అనుకూల వార్తలను ప్రసారం చేసింది. భోపాల్ నుంచి అభ్యర్థిగా నిలబెట్టిన ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ .. పేలుళ్ల కేసులో విముక్తి పొందారని… ప్రచారం చేసింది. కానీ అలాంటిదేమీ అప్పటికీ లేదు. ఇలా చాలా వార్తను న్యూస్ జే బీజేపీకి అనుకూలంగాప్రచారం చేసింది. అయితే తాము కాంగ్రెస్‌కు కూడా ప్రచారంచేశామని.. ఈ ఆరోపణలు అవాస్తవమని న్యూస్ జే తన ట్విట్టర్లో వివరణ ఇచ్చింది.
మొత్తగా బీజేపీ సోషల్ మీడియాను చట్ట విరుద్ధంగా వాడుకుంటున్న వైనం తరచూ విమర్శల పాలవుతూనే ఉంది. రాజకీయాన్ని సోషల్ మీడియా వేదికగా మార్చేస్తున్న బీజేపీ నేతల వ్యూహం రాజకీయాల్ని ఏకపక్షంగా మార్చేస్తోంది.