తెలంగాణలో బీజేపీకి నాలుగో ఆర్ వస్తాడనుకుంటే.. ఒక ఆర్‌ను పార్టీ నుంచి గెంటేసింది బీజేపీ. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది. పది రోజుల్లో.. కొంత కాలంగా చేస్తున్న పార్టీ వ్యతిరేక పనులన్నింటికీ కారణాలంటో చెప్పకపోతే శాశ్తంగా పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించింది. దీనంతటికి కారణంగా ఆయన యూట్యూబ్‌లో పెట్టిన వివాదాస్పద వీడియోనే.
ఇటీవల బీజేపీకి చెందిన నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలతో భారతీయ జనతా పార్టీ ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితినే రాజాసింగ్ తీసుకు వచ్చారు. దీంతో బీజేపీ హైకమాండ్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్పందించి సస్పెన్షన్ వేటు వేసింది. ఈ వీడియో విషయంలో దేశవ్యాప్తంగా రాజాసింగ్‌పై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు వెంటనే స్పందించి… యూట్యూబ్ నుంచ ఆ వీడియోను తొలగింప చేశారు. వెంటనే రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారు.
ఇటీవల హైదరాబాద్‌లో స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శనకు అనుమతి ఇవ్వవొద్దని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఆయన గతంలో హిందూ దేవుళ్లను అవమానిస్తూ స్టాండప్ కామెడీ చేశారని.. అందుకే ప్రదర్శనకు అంగీకరించబోమన్నారు. తనకు పార్టీ ముఖ్యం కాదని వాదించారు. ఇలాంటి వివాదంలోనే నుపుర్ శర్మతో పాటు మరో నేను బీజేపీ తమ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వారి వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా భారత్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడటంతో వారిని తప్పించారు. ఇప్పుడు అదే తప్పు రాజాసింగ్ చేశారు. అయితే.. తనకు పార్టీ ముఖ్యం కాదని.. రాజాసింగ్ చెబుతూ వస్తున్నారు.