భారతీయ జనతా పార్టీ నేత ఒకరు నేరుగా రాష్ట్రపతి వద్దకు వెళ్లారు. విజయసాయిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని… విజ్ఞప్తి చేస్తూ.. ఓ లేఖ ఇచ్చారు. ఆ లేఖ ఆషామాషీగా ఇవ్వలేదు. సుప్రీంకోర్టు తీర్పులు… గత నిర్ణయాలు… ప్రస్తుతం.. వాటికి తగ్గట్లుగా విజయసాయిరెడ్డి పదవికి ఎలా అర్హుడో వివరిస్తూ… ఆ ఫిర్యాదు ఉంది. లాభదాయక పదవుల కింద… విజయసాయిరెడ్డి అనర్హుడని… బీజేపీ నేత రామకోటయ్య వాదిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత హఠాత్తుగా… విజయసాయిరెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కానీ రెండు వారాల్లోనే ఆ జీవోను ఉపసంహరించారు. కానీ అప్పటికే విజయసాయిరెడ్డి అ పదవిని చేపట్టారు. తక్షణం అమల్లోకి వస్తుందని.. ఆ జీవోలో చెప్పడంతోనే ఆయన పదవి చేపట్టినట్లయింది.
కానీ కొన్ని రోజులకు హఠాత్తుగా.. ఆ జీవోను రద్దు చేశారు. ఇలా ఎందుకు చేశారో చాలా మందికి అర్థం కాలేదు కానీ.. వెంటనే.. లాభదాయక పదవుల చట్టాన్ని.. ఏపీ సర్కార్ సవరించి… ఎంపీలను ఆ జాబితానుంచి తొలగించింది. అప్పుడు.. అసలు విషయం వెల్లడయింది. విజయసాయిరెడ్డికి ఇచ్చిన పదవి.. రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చారని.. అనర్హతా వేటు భయంతో.. జీవోను రద్దు చేసి.. చట్టాన్ని సవరించారని స్పష్టమయింది. మళ్లీ కొత్త జీవో జారీ చేసి.. విజయసాయిరెడ్డిని అదే పదవిలో నియమించారు. టీడీపీ నేతలు.. అప్పట్లో ప్రభుత్వంపై విమర్శలు చేసి సైలెంటయ్యారు.. కానీ బీజేపీ నేతలు మాత్రం.. ఇప్పుడు.. విజయసాయిరెడ్డిపై గురి పెట్టారు. అందుకే.. ఆయనపై నేరుగా రాష్ట్రపతికిఫిర్యాదు చేశారు.
రామకోటయ్య బీజేపీలో కీలక నేత కాదు కానీ… ఆయన సొంతంగా… ఇలాంటి ఫిర్యాదులు చేసే అవకాశం మాత్రం లేదు. ఆయనకు… ఆ ఫిర్యాదును తయారు చేసి ఇచ్చి… బీజేపీ పెద్దలే రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇప్పించి.. పంపించారన్న ప్రచారం ఢిల్లీలో జరుగుతోంది. ఇటీవలి కాలంలో… కేంద్రాన్ని లెక్క చేయనట్లుగా ఏపీ సర్కార్ వ్యవహరించడం మాత్రమే కాదు.. అన్నీ… నిర్ణయాలు .. మోడీ, అమిత్ షాలకు చెప్పే చేస్తున్నామని.. వారి ఆశీస్సులున్నాయని… ప్రచారం చేస్తూండటంతో… కేంద్రం గుర్రుగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో.. వైసీపీ నేతలకు చనువు ఇవ్వకూడదని నిర్ణయించుకున్న బీజేపీ… ఎక్కడికక్కడ కట్ చేయడం ప్రారంభించిందని అంటున్నారు. అదే నిజమైతే.. విజయసాయిరెడ్డి కొంత టెన్షన్ ను ఎదుర్కోక తప్పదేమో..?