మీడియాలో ఊపు వచ్చింది కానీ క్షేత్ర స్థాయిలో క్యాడర్ లేని పరిస్థితిని అధిగమింంచడానికి తెలంగాణ బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. చేరికలు అనుకున్న విధంగా సాగడం లేదు. కాంగ్రెస్ నుంచి వచ్చి కొంత మంది చేరినా వారు నియోజకవర్గ స్థాయి నేతలు కాదు. దీంతో తటస్తుల్ని చేర్చుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్లపై ప్రభావం చూపే వ్యక్తుల జాబితాను తయారు చేసుకుని వారికి ఆహ్వానాలు పంపుతోంది.
ఇప్పటి వరకూ రాజకీయాలతో సంబంధం లేని ప్రముఖులు, కులసంఘాల నేతలను ప్రధానంగా బీజేపీ నేతలు గుర్తించారు. వారందరితో మెల్లగా టచ్లోకి వెళ్తున్నారు. వారిలో సగం మందినైనా బీజేపీలోకి ఆహ్వానించగలిగితే బీజేపీ క్షేత్ర స్థాయిలో బలపడుతుందని ఆశిస్తున్నారు. ఈ దిశగా చర్చలు ప్రారంభఇంచారు. మొన్నటివరకు యూపీలో పార్టీ సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షించిన సీనియర్ నేత సునీల్ బన్సల్కు తెలంగాణ బాధ్యతలు అప్పగించారు. ఆయన తెర వెనుక రాజకీయాల్లో దిట్ట అని చెబుతున్నారు.
యూపీలో సాధించిన ఫలితాలను తెలంగాణలోనూ సాధించాలన్న లక్ష్యంతో పార్టీ జాతీయ నాయకత్వం ఆయనకు పూర్తి స్వేచ్చ ఇచ్చిందని దీంతో ఆయన తన బృందాలను తెలగాణలో రంగంలోకి దించారని అంటున్నారు. కొంత మంది తటస్తులకూ టిక్కెట్లు ఇచ్చేందుకు బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. క్షేత్ర స్థాయిలో బలోపేతం అయితే ప్రజలు ఓట్లేస్తారని.. ఓట్లేయాలనుకున్న వారితో ఓట్లేయించుకునే వ్యవస్థ లేకపోతే ఇబ్బంది అవుతుందని బీజేపీ భావిస్తోంది.