తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రధాని మోదీతో రెండు నిమిషాలు నిలబడి మాట్లాడగానే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం మొత్తం మారిపోయింది. తెలంగాణలో బీజేపీకి టీడీపీ సహకరించేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు బీజేపీ ఓ ప్రధాన పోటీదారుగా ఉంది. టీడీపీ అసలు లేదు. దాదాపుగా అంతర్ధానం అయిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ మేజర్ భాగస్వామిగా ఉండి బీజేపీతో పొత్తులు పెట్టుకుంది. టీడీపీకి పధ్నాలుగు అసెంబ్లీ సీట్లు.. బీజేపీకి ఐదు సీట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు టీడీపీకి అభ్యర్థులు లేని పరిస్థితి.
ఇలాంటి పరిస్థితిలో టీడీపీ సహకారాన్ని బీజేపీ కోరుతుందా అనేది ముఖ్య సందేహం. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీకి టీడీపీ మద్దతు వల్ల ప్లస్‌తో పాటుమైనస్ కూడా ఉంటుంది. చంద్రబాబు బీజేపీ రూపంలో మళ్లీ తెలంగాణలోకి వస్తున్నారని టీఆర్ఎస్ అధినేత ప్రచారం చేసే అవకాశం ఉంది. ఆ సెంటిమంట్ వర్కవుట్ అయితే బీజేపీకి చంద్రబాబు.. టీడీపీ వల్ల కలిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ. గత ఎన్నికల్లో ఇది స్పష్టయింది. బీజేపీ నేతలకకూ టీడీపీ సపోర్ట్ ఇష్టముంటుందని అనుకునే పరిస్థితి లేదు.
అయితే చంద్రబాబు అసలు తెలంగాణలో పోటీచేయకుడా తెర వెనుక బీజేపీకి మద్దతిస్తే మాత్రం కొంత వరకూ ఆ పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంది. కానీ ఇది సాధ్యమేనా అనేది తేలాల్సి ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ వైసీపీకి మద్దతుగా ఉంటారు కాబట్టి.. ఏపీలో తమ పార్టీ బాగుకోసం అయినా కేసీఆర్‌ను ఓడించేందుకు బీజేపీకి మద్దతిచ్చే ఆలోచన చందర్బాబు చేయవచ్చని చెబుతున్నారు.