బీజేపీకి జాతీయ స్థాయిలో కొత్త అధ్యక్షుడ్ని ఖరారు చేయనున్నారు. బీజేపీలో అంతర్గత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది . చాలా రాష్ట్రాల్లో అధ్యక్షుల మార్పుపై ఓ నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు జాతీయ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. ఈ సారి జాతీయ అధ్యక్షుడిగా దళిత లేదా ఏబీసీ వర్గానికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు. అందు కోసం అన్వేషణ జరుపుతున్నారు. అయితే ఆ నేత పవర్ ఫుల్ అయ్యే అవకాశం లేదు. మోదీ, షాల కనుసన్నల్లోనే పనిచేయనున్నారు.
భారతీయ జనతా పార్టీలో అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఉన్న పవర్ ఎంత ?. బీజేపీ నేతలకు మొదట ప్రధాని మోదీ , తర్వాత అమిత్ షా. ఆ తర్వాత ఇంకెరవైనా ఉంటారేమో కానీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాత్రం కాదు. ఎందుకంటే ఆయనకు అంత పలుకుబడి లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకీ అధ్యక్షుడు ఎంత పవర్ ఫుల్ అయి ఉండాలి.. కానీ నడ్డా మాత్రం మోదీ, షా కనుసన్నల్లో పని చేసే నేత మాత్రమే. వారు చెప్పే వాటికి తలూపుతారు.. ఇంకా చెప్పాలంటే వారే నిర్ణయాలు తీసుకుంటారు. నడ్డా నామమాత్రం. ఇప్పుడు ఆయన పదవి కాలం కూడా పూర్తవుతోంది.
జనవరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పెద్దగా ఎవరికీ తెలియని నేతను ఎంపిక చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. శివరాజ్ సింగ్ చౌహాన్, ఫడ్నవీస్ సహా చాలా మంది సీనియర్ల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ జాబితా నుంచి వచ్చే అవకాశం లేదు. ఇప్పటి వరకూ మోదీ , షాల ఎంపికలు చూస్తే అదే చెబుతుంది. వివిదా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల్ని కూడా ఎవరికీ తెలియని వారిని నియమిస్తున్నారు. ఇప్పుడు జాతీయ అధ్యక్ష పదవిని కూడా అలాగే ఖరారు చేసే అవకాశం ఉంది.