జమ్మూ కశ్మీర్, సిక్కింతోపాటు ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపునకు కేంద్రం రంగం సిద్దం చేసింది. వీలైనంత త్వరగా.. నాలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. త్వరలో నాలుగు రాష్ట్రాలకు కలిపి …ఒకే పునర్విభజన కమిషన్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే బిల్లు కూడా రెడీ అయింది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో పెట్టనున్నారు. సీట్లు పెంచాలంటే రాజ్యాంగ సవరణ అవసరం .. ఆ మేరకు బీజేపీకి ఇప్పుడు పట్టు ఉంది.
పెరిగిన అసెంబ్లీ సీట్లతోనే జమిలీ ఎన్నికలు ..!
జమలీ ఎన్నికలతో..రాష్ట్ర ప్రభుత్వాలలోనూ బీజేపీనే పాగా వేయాలన్న పట్టుదలతో ఉన్న మోదీ, అమిత్ షా.. ఈ మేరకు.. ఇప్పటికే.. తాము బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రత్యేకమైన రాజకీయ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఏపీల్లో బీజేపీ ఇంత వరకూ.. బలీయమైన శక్తిగా ఎప్పుడూ లేదు. ఈ సారి మాత్రం.. ఏకంగా అధికారంలోకి రావాలన్న పట్టుదలతోనే… రాజకీయాలు చేస్తున్నారు. వరుస చేరికలతో తెలుగు రాష్ట్రాల్లో తాము బలపడుతున్నామనే సంకేతాలను పంపిస్తున్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్.. ఏపీలో 2024కి తమదే అధికారం అని రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రతీ సారి చెబుతున్నారు. ఏపీ ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లు అయిందని.. ప్రజల కష్టాలు బీజేపీ వల్లే తీరుతాయని చెబుతున్నారు. బీజేపీ నేతలంతా ఇప్పటికే టీడీపీకి పట్టిన గతే.. జగన్‌కూ పడుతుందని హెచ్చరికలు చేశారు. ఆ విమర్శల ఘాటు అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నారు. మొన్నటి ఎన్నికల్లో.. వైసీపీకి వచ్చిన 50 శాతం ఓట్లలో… 20 శాతం బీజేపీ ఓట్లేనని.. కన్నా ప్రకటించుకోవడం… రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.
తర్వాత మాదే అధికారం అని ఇప్పటికే రాసిచ్చేసిన బీజేపీ..!
భారతీయ జనతా పార్టీ.. సీట్ల పెంపుతో.. తెలుగు రాష్ట్రాల్లో బలపడగలమని అంచనాతో ఉంది. జమిలీ ఎన్నికలలోపు.. ఎప్పుడు.. ఎలా వ్యవహరించాలో.. ఓ టైంటేబుల్ కూడా రెడీ చేసుకున్నట్లుగా చెబుతున్నారు. టీడీపీ నాయకత్వం బలహీనమైందని … చెబుతూ.. ఆ పార్టీ క్యాడర్‌ను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో… నాలుగు పార్లమెంట్ సీట్లలో గెలిచిన ఉత్సాహంతో… జాతీయవాద భావజాలంతో… చాపకింద నీరులా విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. రెండు చోట్ల..క్యాడర్‌ను పెంచుకుంటున్నందున.. ఎన్నికల నాటికి..మోడీ వేవ్‌తో.. స్వీప్ చేస్తామన్న అంచనాలో… బీజేపీ నేతలు ఉన్నారు. అంటే.. ముందు ముందు.. మరిన్ని సంచలనాలు.. ఏపీ రాజకీయాల్లో ఖాయంగా కనిపిస్తోంది.. తెలంగాణలో అయితే.. మరో రెండేళ్లలో బీజేపీదే అధికారమని కూడా చెబుతున్నాు.
మెజార్టీ-మైనార్టీ రాజకీయాలతో బేస్ పెంచుకునే ప్రయత్నాలు..!
భారతీయ జనతా పార్టీ మార్క్ మైనార్టీ – మెజార్టీ రాజకీయాలకు .. కూడా గట్టిగానే పునాది వేసే ప్రయత్నాలను ఆ పార్టీ నేతలు చేస్తున్నారు. సహజంగా.. జగన్మోహన్ రెడ్డి.. పాలనలో .. క్రిస్టియన్ కోటరీ ఏర్పాటు చేసుకున్నారనే ప్రచారం ఊపందుకుంటోంది. అది బీజేపీ పెద్దల వరకూ వెళ్లిందని.. అందుకే.. కొంత మంది అధికారుల్ని.. ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకోవాలనుకున్నప్పటికీ.. అడ్డుకట్ట వేశారని చెబుతున్నారు. అదే సమయంలో.. ఏపీలో కొన్ని ఘటనలను.. బీజేపీ నేతలు అనూహ్యంగా.. పెద్దవి చేసి చూపిస్తున్నారు. విశాఖలో చర్చిలకు భద్రత కల్పించడంపై.. బీజేపీ ఆందోళన అలాంటిదే. అసెంబ్లీ సీట్లు పెంచి… తెలుగు రాష్ట్రాల్లో జెండా పాతేందుకు బీజేపీ.. అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తోంది.