భారతీయ జనతా పార్టీలో కొంత మంది నేతలు చేరారు. వీరిలో ఏపీ నుంచి శనక్కాయల అరుణ, పాతూరి నాగభూషణం, వాకాటి నారాయణ రెడ్డి, పూతలపట్టు రవిలకు..లాంటి వాళ్లు ఉన్నారు. శనక్కాయల అరుణ .. మాజీ మంత్రి. గుంటూరులో ప్రముఖ వైద్యురాలిగా ఉన్న ఈమెను.. 1999లో తటస్థుల కోటాలో చంద్రబాబు గుంటూరు -2 అసెంబ్లీ స్థానం నుంచి టిక్కెట్ ఇచ్చి పోటీ చేయించారు. గెలిచిన వెంటనే.. మంత్రి పదవి కూడా ఇచ్చారు. మధ్యలోనే పదవి పీకేసినప్పటికీ.. ఆమెటీడీపీ నేతగా కొనసాగుతున్నారు. ఆ తర్వాత పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఆమె కుమారుడు ఉమాశంకర్‌ను రాజకీయాల్లోకి తేవాలని ప్రయత్నించారు. గత ఎన్నికల్లో టీడీపీ కోసమే పని చేశారు. అయితే.. ఆమె కొద్ది రోజుల కిందట.. అనూహ్యంగా జాతీయస్థాయిలో వివాదాస్పదమయ్యారు. 75 ఏళ్లు దాటిన వృద్ధ దంపతులకు తన హాస్పిటల్లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేశారు. ఇది ప్రపంచరికార్డుని సంబరాలు చేసుకున్నారు కానీ.. నిబంధనలు ఉల్లంఘించారంటూ.. నోటీసుల మీద నోటీసులు వచ్చి పడ్డారు. ఏపీ ప్రభుత్వం కూడా విచారణ ప్రారంభించింది. ఈ క్రమంలో.. ఆమె హాస్పిటల్‌ను రక్షించుకోవడానికైనా సరే… పార్టీ మారక తప్పని పరిస్థితి ఏర్పడింది. కన్నా వెంటనే టచ్‌లోకి వెళ్లిపోయి.. ఢిల్లీ తీసుకెళ్లి కండువా కప్పిస్తున్నారు.
ఇక గుంటూరు మాజీ జడ్పీ చైర్మన్ పాతూరి నాగభూషణం కూడా.. అంతే. జడ్పీ చైర్మన్ గా పదవి అనుభవించి .. ఆ తర్వాత టీడీపీ గురించి పట్టించుకోని ఆయన… గత ఎన్నికల్లో మళ్లీ హడావుడి చేసే ప్రయత్నం చేశారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. అయితే.. ఆయన బీజేపీలో చేరడానికి అసలు కారణం.. కరకట్టపై ఉన్న ఇల్లు. ఆయనకు చంద్రబాబు ఉంటున్న ఇంటికి సమీపంలోనే కరకట్టపై ఐదు ఎకరాల స్థలం .. అందులో ఇల్లు కూడా ఉంది. దీన్నే మొన్న కొంత భాగాన్ని ఏపీ ప్రభుత్వం కూలగొట్టంచింది దీంతో.. తన కరకట్ట ఇంటిని కాపాడుకోవడానికి బీజేపీలోకి చేరడమే మేలైన మార్గమని ఆయన భావించినట్లున్నారు. కన్నా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇక టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిది మరో కథ. ఆయన బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో అరెస్టయి… బెంగళూరు కోర్టులో ఏడాదికిపైగా ఉన్నారు. ఆయనను టీడీపీ సస్పెండ్ చేసింది. కొద్ది రోజుల కిందటే.. బెయిల్ లభిస్తే.. నెల్లూరుకు తిరిగి వచ్చారు. ఆయనకు బీజేపీలో చేరడం మినహా మరో దారి లేనట్లుగా మారింది. సీబీఐ కేసులున్నాయని.. టీడీపీ సస్పెండ్ చేస్తే.. ఆయనను చేర్చుకునేందుకు బీజేపీ ఏ మాత్రం సంకోచించలేదు. గత ఎన్నికల్లో వాకాటి నారాయణరెడ్డి వర్గీయులు వైసీపీకి మద్దతు పలికారు. మొత్తానికి కేసులు, కష్టాలు ఉన్న వారందరికీ బీజేపీ గమ్యస్థానంగా కనిపిస్తోంది.