తెలుగు రాష్ట్రాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను భారతీయ జనతా పార్టీ బ్రాండ్ అంబాసిడర్‌గా వాడుకోవాలనుకుంటోంది. అయితే ఇది డైరక్ట్ రాజకీయాల కోసం కాదు.. ఎన్నార్సీ, సీఏఏలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పవన్ ను వాడుకోబోతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే.. పవన్ కల్యాణ్ కూడా..తన ఆమోదాన్ని అనేక ప్రకటనల ద్వారా చేశారు. ముస్లింలకు.. సీఏఏ, ఎన్నార్సీ వల్ల ఎలాంటి అపాయం లేదని… తాను భరోసా ఇస్తానని ప్రకటించారు. బీజేపీతో కలిసిన తర్వాత పవన్ కల్యాణ్.. చాలా క్లారిటీగా మాట్లాడుతున్న అంశం సీఏఎ, ఎన్నార్సీనే. పవన్ కు ఉన్న ప్రజాదరణ.. ఆయన చెబితే.. గట్టిగా ప్రజల్లోకి వెళ్తుందన్న నమ్మకంతో.. భారతీయ జనతా పార్టీ నేతలు కూడా.. ఈ విషయంలో ఆయనను మరింత ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి… ఎన్నార్సీ, సీఏఏలపై అవగాహన సభను భారీ ఎత్తున నిర్వహించాలనుకుంటున్న బీజేపీ… మార్చి 14వ తేదీ దానికి ముహుర్తం ఖరారు చేసుకుంది. ఈ సభకు.. హాజరుకానున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరవుతారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ప్రత్యేక అతిధిగా పిలుస్తున్నారు. సీఏఏను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలంటే.. పవన్ కల్యాణ్ వంటి స్టార్ అవసరమని బీజేపీ భావిస్తోంది. కొద్ది రోజుల కిందట పవన్ కల్యాణ్‌ను.. తెలంగాణ బీజేపీ నేతలు కూడా కలిశారు. పవన్ కల్యాణ్‌తో కలిసి పని చేస్తామని ప్రకిటంచారు.
సీఏఏ, ఎన్నార్సీ ప్రచార వ్యవహారాల్లో.. పవన్ కల్యాణ్ ను విస్తృతంగా వాడుకునే ఉద్దేశంతోనే ఇలా ముందుగానే పవన్ కల్యాణ్ తో తెలంగాణ నేతలు పరిచయాలు పెంచుకున్నట్లుగా తెలుస్తోంది. ముందు ముందు.. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రాయలసీమలోనూ పవన్ కల్యాణ్ ను ముందు పెట్టి.. బీజేపీ మరిన్ని సీఏఏ, ఎన్నార్సీ సభలు నిర్వహించే అవకాశం ఉంది.