సొలు దొర – సెలవు దొర అని బీజేపీ అంటూంటే… సాలు మోదీ.. సంపకు మోదీ అని టీఆర్ఎస్ రివర్స్ కౌంటర్ ఇస్తోంది. తమ పార్టీ ఆఫీస్ ముందు డిజిటల్ బోర్డు పెట్టి మరీ బీజేపీ కౌంట్ డౌన్ నిర్వహిస్తోంది . దీనికి టీఆర్ఎస్ నేతలు ” సాలు మోదీ – సంపకు మోదీ” అని టైటిల్ పెట్టి .. బైబై మోదీ అంటూ ఫ్లెక్సీలు వేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికార పార్టీ.. కేంద్రంలో బీజేపీ. బైబై స్లోగన్లు ఇవ్వాలంటే రెండు పార్టీలూ ఇచ్చుకోవచ్చు.
బీజేపీ నేతలు తెలంగాణ ప్రభుత్వాన్ని కించపరిచేలా బోర్డులు పెడుతున్నారని టీఆర్ఎస్ నేతలంటున్నారు. అలా అని ఊరుకోవడం లేదు. బీజేపీని ఇరిటేట్ చేసేలా ప్రచారం చేస్తోంది. రేపు బీజేపీ కార్యవర్గ సమావేాల సందర్భంగా వచ్చే బీజేపీ పెద్దలందరికీ.. ఎక్కడ చూసినా టీఆర్ఎస్ అభివృద్ది కనిపించేలా ప్రచార ఏర్పాట్లూ చేసుకుంది. గట్టిగా యాభై వేలు మంది పట్టని పరేడ్ గ్రౌండ్స్‌లో పది లక్షల మందితో సభ నిర్వహిస్తామని బీజేపీ చెబుతున్న ప్రాంతంలోనూ టీఆర్ఎస్ ఫ్లెక్సీలే కనిపించబోతున్నాయి. ఎవరికి వారు ఈ ప్రచారంలో పైచేయి కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
ఈ ప్రచార రాజకీయంలో రాజకీయ పార్టీలు ప్రజలు గురించి మర్చిపోతున్నాయి. ఎవరికి వారు ఎదుటివారిని కించ పర్చి.. తాము వెలిగిపోదామనకుంటున్నాయి. కానీ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. ఎవరికి సాలు అని చెప్పాలో.. ఎవరికి సెలవు ఇవ్వాలో వాళ్లు కరెక్ట్‌గానే డిసైడ్ చేస్తారు . కానీ సోషల్ మీడియా ప్రచార యుగంలో అంతా ఇలాంటి ప్రచారం మీదనే నడుస్తుంది.