చర్చి, మసీదుల్లోనూ కేసీఆర్ తన బొమ్మలు చెక్కించుకోగలరా..?హిందూమతంపైనే ఎందుకు దాడి చేస్తున్నారు..? అంటూ.. భారతీయ జనతా పార్టీ నేతలు… టీఆర్ఎస్ పై యుద్ధం ప్రకటించారు. యాదాద్రి ఆలయంలో.. కేసీఆర్ తో పాటు.. టీఆర్ఎస్ గుర్తు, ప్రభుత్వ పథకాల పేర్లు ఉండటాన్ని బీజేపీ.. హిందూ మతంపై .. జరుగుతున్న దాడిగా అభివర్ణిస్తోంది. ఈ వివాదం చినికి చినికి గాలి వానగా మారుతూండటంతో… ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. నిన్న వివరణ ఇచ్చిన వైటీడీఏ చైర్మన్, స్థపతి, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి.. సూచనల మేరకు శిల్పులు… కొన్ని చెక్కుడు కార్యక్రమాలు చేశారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన శిల్పాల్లో.. కొంత మేర చెక్కేశారు. పేర్లను తొలగించారు. అయితే.. గుర్తులు మాత్రం అంతే ఉన్నాయి.
కేసీఆర్ బొమ్మ జోలికి వెళ్లలేదు. మరో వైపు సీఎంవో కూడా.. యాదాద్రి స్తంభాల్లో ఉన్న బొమ్మల వివాదంపై వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. మరో వైపు బీజేపీ నేతలు… పలువురు.. యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. ముఖ్యంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్… ప్రభుత్వానికి వారం రోజుల డెడ్ లైన్ పెట్టారు. ఆలయానికి వెళ్లి.. మొత్తం పరిశీలించిన ఆయన వారం లో… రాజకీయ పరంగా ఉన్న బొమ్మలంటినీ.. తొలగించాల్సిందేనని అల్టిమేటం జారీ చేశారు. లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులను పిలిపించి.. ఉద్యమం చేస్తామని ప్రకటించారు.
మరో వైపు… బీజేపీ, టీడీపీ నేతలు కూడా.. ఈ అంశంపై … ప్రభుత్వం తీరును తప్పు పడుతున్నారు. వీలైనంత త్వరగా.. ఈ వివాదాన్ని ముగించాలని… తెలంగాణ సర్కార్ కూడా ప్రయత్నిస్తోంది. వివాదాస్పద బొమ్మలును తొలగించాలనే… అంతర్గత ఆదేశాలు మౌఖికంగా వెళ్లాయని చెబుతున్నారు. అయితే…అసలు ఎవరు చెక్కమని చెప్పారు..? శిల్పులు ఎందుకు చెక్కారు..? అనే వివరాలు తెలుసుకుని.. చర్యలు తీసుకోవాల్సిందేనని..పలువురు విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.