కన్నా లక్ష్మినారాయణ రూ. 20కోట్లకు టీడీపీకి అమ్ముడుపోయారని … సుజనా చౌదరి బ్రోకర్‌గా వ్యవహరించారని.. విజయసాయిరెడ్డి విశాఖలో ఆరోపించారు. ఆ వెంటనే… విజయసాయిరెడ్డిపై బీజేపీ విరుచుకపుడింది. ఇంగ్లిష్, తెలుగులో.. విజయసాయిరెడ్డి ట్వీట్లలో పెట్టే భాష కన్నా నాటుగానే ఉండే విధంగా.. ఉపయోగిస్తూ.. విరుచుకుపడింది. బ్రోకర్ అన్న దగ్గర్నుంచి ప్రారంభించి జైలు పక్షి అన్న దాని వరకూ.. చాలా బిరుదులను.. ఏపీ బీజేపీ విజయసాయిరెడ్డికి ఇచ్చింది. ఇంతకీ విజయసాయిరెడ్డి.. కన్నా లక్ష్మినారాయణ మీద ఎందుకు ఫైరయ్యారంటే.. వైరస్ టెస్ట్ కిట్లను ఎక్కువ రేట్లను కొనుగోలు చేయడంతో.. కొట్టేశారా అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ఇది విజయసాయిరెడ్డికి నచ్చలేదు. కొట్టేయడం ఏమిటి.. కొట్టేయడం అనుకున్నారేమో కానీ.. విశాఖలో ఒక్క సారిగా ఫైరయ్యారు. కన్నాను చెడామడా తిట్టేశారు.
విజయసాయిరెడ్డి తిడితే… తమకు సంస్కారం ఉందని.. తాము అలా తిట్టమనే ఎస్కేపిజం డైలాగులు బీజేపీ చెప్పలేదు. ఘాటు లాంగ్వేజ్‌తోనే.. సమాధానం ఇచ్చింది. బీజేపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లోనే విజయసాయిరెడ్డిపై తిట్ల వర్షం కురిపించింది. ఇంత వరకూ బీజేపీతమ ట్విట్టర్ హ్యాండిల్లో అలా ఎవర్నీ తిట్టలేదు. సంస్కారం పాటించింది. కానీ.. విజయసాయిరెడ్డి లాంటి వారికి.. అలాంటి లాంగ్వేజ్‌లోనే సమాధానం చెప్పాలనుకుందేమో కానీ.. కట్టుబాట్లను కాదనుకుంది. చెలరేగిపోయింది. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై ఇష్టం వచ్చినట్లుగా నోరు జారితే ఊరుకునేది లేదని వార్నింగ్‌ను పంపింది. ఇప్పుడు… విజయసాయిరెడ్డి .. స్పందించాల్సి ఉంది. కన్నా లక్ష్మినారాయణపై తాను చేసిన విమర్శలకు కట్టుబడి.. తనను దారుణంగా విమర్శించిన బీజేపీపై అదే తరహా విమర్శల దాడి చేస్తారో.. లేకపోతే… బీజేపీతో పెట్టుకోకపోవడం మంచిదని సైలెంటవుతారో చూడాలి.
అయితే.. బీజేపీ వర్సెస్ విజయసాయిరెడ్డి వ్యవహారంపై.. రాజకీయవర్గాల్లో భిన్నమైన స్పందన కనిపిస్తోంది. విజయసాయిరెడ్డి బీజేపీ అగ్రనేతలకు సన్నిహితుడు. ఆయన అదే చెప్పుకుంటారు. చాలా సార్లు… ఆయన సాన్నిహిత్యం బయటపడింది కూడా. అందుకే.. పొలిటికల్ గేమ్‌లో భాగంగా.. ప్రస్తుత సిట్యూయేషన్ ను డైవర్ట్ చేయడానికి ఇలా గేమ్ ఆడుతున్నారన్న అనుమానాలు కూడా.. ఇతర పార్టీల నేతలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయం అంటే.. ఎలా ఉంటుందో ఊహించడం కష్టం మరి.