నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీర్ అహ్మద్ … బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. తర్వాత షకీల్ అహ్మద్… తన పార్టీ టీఆర్ఎస్పై ఘాటు వ్యాఖ్యలే చేశారు. తనకు.. టీఆర్ఎస్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని.. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి.. పార్టీలో ఉంటున్నట్లుగా ప్రకటన చేశారు. బీజేపీలో చేరే విషయంపై త్వరలో ప్రకటన చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత టీఆర్ఎస్ నేతలు ఆయనతో టచ్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశారని.. కానీ ఆయన స్పందించలేదని మీడియాలో ప్రచారం జరిగింది కానీ… టీఆర్ఎస్ నేతలు ..షకీల్‌ను టోటల్‌గా లైట్ తీసుకున్నారు. ఆయన పార్టీని వీడిపోవడం వల్ల టీఆర్ఎస్కు జరిగే నష్టం సంగతేమో కానీ.. బీజేపీ క్యారెక్టర్ మీదే … మరో మరక పడుతుందని టీఆర్ఎస్ నేతలు … గుసగుసలాడుకుంటున్నారు.
షకీల్‌పై ఉన్న కేసులు ఆషామాషీవి కాదు.. !
టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరుతారంటూ.. కొంత మంది పేర్లు బయటకు వినిపించినప్పటికీ.. వాటిలో షకీల్ పేరు లేదు. హఠాత్తుగా.. ఆయన బీజేపీ ఎంపీని కలిసి.. టీఆర్ఎస్ పై విమర్శలు చేసి.. స్పెక్యూలేషన్ పెంచుకున్నారు. నిజానికి ఆయన అలా చేయకపోతే .. ఇప్పటికే.. షకీర్ పై నమోదైన తీవ్రమైన కేసుల్లో జైలుకెళ్లక తప్పదన్న ప్రచారం కొద్ది రోజులుగా సాగుతోంది. షకీల్ రాజకీయంగా… ఎప్పుడూ ప్రముఖ స్థానంలోకి రాలేదు. మీడియా హైప్‌కి కూడా దూరంగా ఉంటారు. కానీ ఆయన చరిత్ర మాత్రం చాలా ఉన్నతం. ఆయనపై ఉన్న కేసులన్నీ.. ఢిల్లీ, ముంబై రేంజ్‌లోనే ఉంటాయి. అవి కూడా ఎయిర్‌పోర్టుల్లోనే నమోదయి ఉంటాయి. అంటే.. మానవ అక్రమ రవాణా కేసుల్లో ఆయన నిందితుడు.
టీఆర్ఎస్ నేతలతో అప్పటి బంధమే కీలకం..!
షకీల్ అమీర్.. మనుషుల అక్రమ రవాణా కేసులో మొట్టమొదటి సారిగా.. 15 ఏళ్ల కిందటే పట్టుబడ్డాడు. 2005లోనే.. ఓ సారి దొరికారు. పోలీసులు పట్టుకున్నారు. మళ్ళీ 2007లో ఢిల్లీ విమానాశ్రయంలో మరో కేసు. అదే విమానాశ్రయంలో.. 2013లో తీవ్రమైన నేరంలో పట్టుబడ్డారు. అన్ని నేరాలలో 420, 471 ఉండగా… రెండు కేసులలో 120బి సెక్షన్ కూడా ఉంది. హఠాత్తుగా రాజకీయాలు మారాయి. హైదరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్లో సెక్షన్లు 420, 471తో 2005లో ఓ ఎఫ్ఐఆర్ నమోదయింది. ఈ కేసులన్నీ షకీల్ తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నవే. టీఆర్ఎస్ … కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని 2004లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులపై మానవ అక్రమ రవాణా కేసులు వెలుగులోకి వచ్చాయి. అప్పుడే షకీల్ పేరు కూడా మార్మోగిపోయింది. ఈ కేసుల బంధంతో షకీల్ ఎమ్మెల్యే అయ్యారని.. రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు తరచూ ఆరోపణలు గుప్పిస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబానికి ఈ షకీల్ అమీర్ అత్యంత సన్నిహితుడు. రంజాన్ లాంటి పండుగలు వస్తే.. కేసీఆర్ షకీల్ ఇంటికి విందుకెళ్తారు.
కేసుల చిక్కులు రాకుండానే బీజేపీ వైపు చూస్తున్నారా..?
అయితే… బోధన్ ఎమ్మెల్యేపై నమోదైన కేసులు… టీఆర్ఎస్ పెద్దలతో లింక్ అప్ అయి ఉన్నవే. ముందస్తు ఎన్నికలకు ముందు.. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని టార్గెట్ చేసేందుకు కేసీఆర్ .. ఆ కేసుల్ని కూడా కదిలించారు. ఇప్పుడు బీజేపీకి అదే పెద్ద అస్త్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా.. షకీల్ అమీర్‌ను బీజేపీలోకి పంపుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అదే నిజమైతే.. షకీర్ బీజేపీలో చేరినా… టీఆర్ఎస్ అనర్హతా వేటు వేసే అవకాశం ఉండకపోవచ్చు. మొత్తానికి తెలంగాణలో రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోందనుకోవచ్చు.