ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో నేతలు చేస్తున్న భిన్నమైన వాదనలతో అసలు బీజేపీ విధానం ఏమిటన్న దానిపై ప్రజలకు వస్తున్న సందేహం అది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ.. ఓ స్పష్టమైన విధానం తీసుకుంటుందని చాలా మంది అనుకున్నారు. కానీ బీజేపీ ఏ నిర్ణయమూ తీసుకోవడం లేదు. ఓ నిర్ణయం తీసుకుంటే.. తాము రాజకీయంగా నష్టపోతామని భావించి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారేమోనని.. అనుకోవడానికి కూడా ఏపీ రాజకీయం లేదు. అసలు బీజేపీ ఉందో లేదో తెలియదు. గత ఎన్నికల్లో బీజేపీ కన్నా నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇలాంటి సమయంలో దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీగా బాధ్యతా యుతంగా ఉండాల్సిన బీజేపీ ఇన్ని పిల్లిమొగ్గలు ఎందుకు వేస్తోందో.. ఎవరికీ అర్థం కావడం లేదు.
కేంద్రానికి సంబంధం లేదనే వాదనే వినిపిస్తున్న బీజేపీ..!
అమరావతికే మద్దతుగా ఉంటాము కానీ… ఏపీ సర్కార్ తీసుకునే నిర్ణయంతో మాత్రం కేంద్రానికి సంబంధం లేదనే వాదనను బీజేపీ నేతలు వినిపిస్తున్నారు. కేంద్రానికి సంబంధం లేదనే మాటనే మొదటగా చెబుతున్నారు. అమరావతిని కదిలిస్తే.. ప్రజాగ్రహం వస్తుందని.. అది తమ పార్టీ మీదకు రాకుండా… ఆయన ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా… ప్రకటనలు ఉంటున్నాయి. అయితే .. ఇలా చెబుతున్న సందర్భాల్లో అన్యాపదేశంగా అయినా.. కేంద్రం ఆమోదం తప్పని సరి అన్న విషయాన్ని అంగీకరిస్తున్నారు. కొత్త ప్రభుత్వం కూడా జీవో జారీ చేస్తే.. దాన్ని కేంద్రం ఆమోదిస్తుందంటున్నారు. దానిపై భిన్న వాదనలు ఉన్నాయి. అవన్నీ… కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి జోక్యం చేసుకోవాలా.. వద్దా అన్న దానిపై వ్యక్తమయ్యే అభిప్రాయాలు.
జగన్ గుప్పిట్లో ఉన్న మాట వాస్తవం కాదా..?
రాజకీయ పరంగా చూస్తే.. భారతీయ జనతా పార్టీ చేతిలో.. జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభావితం చేయగల అస్త్రాలు… అమ్ముల పొది నిండా ఉన్నాయి. అవి ఎంత బలమైనవి అంటే… ప్రత్యేకహోదా గురించి నోరు ఎత్తితే.. రాజకీయంగా అంతమైపోతారన్నంత తీవ్రంగా హెచ్చరించేంతగా ఉన్నాయి. అసలు హోదా మాటెత్తవద్దని.. జగన్ పై గుడ్లురుముతున్న బీజేపీ… అదే రాజధాని విషయంలో.. మాత్రం.. జగన్‌కు ఎందుకు జగన్‌కే సూపర్ పవర్స్ ఉన్నాయని..తాము ఆశక్తులమని చెప్పుకునే ప్రయత్నం చేస్తోందనేదే ఇక్కడ కీలక పాయింట్. అధికారం చేపట్టిన నాటి నుండి.. వైసీపీ ప్రభుత్వాన్ని దగ్గరుండి నడుపుతున్న వారు.. తాము తీసుకుంటున్న ప్రతీ వివాదాస్పద నిర్ణయానికి కేంద్రం ఆమోద ముద్ర ఉందన్న ప్రచారం చేస్తున్నారు. దేశం ఇమేజ్ దెబ్బతినేనా..పీపీఏల విషయంలో జగన్ చట్టఉల్లంఘనకు పాల్పడినా కేంద్రం స్పందించకపోవడంతో.. అది నిజమేనని ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది.
పరస్పర సహకారంతోనే రాజకీయం చక్కబెట్టుకుంటున్నారా..?
పరస్పర రాజకీయ ప్రయోజనాలతో .. బీజేపీ, వైసీపీ ముందుకు వెళ్తున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది. ఎన్నార్సీ బిల్లుకు వైసీపీ పార్లమెంట్లో మద్దతు తెలిపింది. దీనికి ప్రతిఫలంగా.. రాజధాని అంశంలో తాము జోక్యం చేసుకోబోమన్న హామీని వైసీపీ పొందిందన్న ప్రచారం ఢిల్లీలో జరుగుతోంది. అదే సమయంలో..తమ చేతికి మట్టి అంటకుండా..తమకు సంబధం లేదనే వాదనను.. బీజేపీకి తెరపైకి తెచ్చిందంటున్నారు. అందుకే రాజకీయంగా ఏపీలో ఒకమాట.. ఢిల్లీలో మరో మాట మాట్లడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..