తెలంగాణలో ఎన్నికలు చివరి దశకు చేరుకుంటూండటంతో ఏపీలో బీజేపీని చక్కదిద్దాలని బీజేపీ పెద్దలు బ యలుదేరారు. పురందేశ్వరిని అధ్యక్షురాలిగా నియమించిన తర్వాత కార్యవర్గ సమావేశం జరగలేదు. తొలి కార్యవర్గ సమావేశాన్ని ఒంగోలులో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కేంద్ర పార్టీ తరపున బీఎల్ సంతోష్ హాజరవుతున్నారు. ఇందు కోసం ఆయన ఇప్పటికే ఒంగోలు చేరుకున్నారు. బీఎల్ సంతోష్ లాంటి నేత రావడంతో .. ఏపీ బీజేపీలో ఏదో కీలక నిర్ణయాలు తీసుకోవడం.. దిశానిర్దేశం చేయడం వంటివి ఉంటాయని భావిస్తున్నారు.
ఏపీ బీజేపీ ఇటీవలి కాలంలో రెండుగా విడిపోయింది. ఓ వర్గానికి విజయసాయిరెడ్డి అధ్యక్షత వహిస్తున్నారు. వారంతా ప్రో వైసీపీ లీడర్స్. వారి తరపున విజయసాయిరెడ్డి పురందేశ్వరిపై విమర్శలు చేస్తున్నారు. మరో వర్గం పురందేశ్వరి వైపు ఉంది. వారిని ప్రో టీడీపీ వర్గంగా మిగిలిన వర్గం వాదిస్తోంది. అంటే ఏపీ బీజేపీలో టీడీపీ, వైసీపీ వర్గాలున్నాయి కానీ.. ఆసలన బీజేపీ వర్గమే లేనట్లు అయింది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ పరిస్థితిని చక్కదిద్ది.. .హైకమాండ్ ఆలోచనలు వివరించేందుకు బీఎల్ సంతోష్ వచ్చినట్లుగా భావిస్తున్నారు.
తెలంగాణలో జనసేనతో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఏపీలో మాత్రం జనసేన, టీడీపీ కలిసి వెళ్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ రాజకీయవ్యూహం ఆసక్తికరంగా మారింది. బీజేపీని కూడా కలుపుకోవాలంటే… వైసీపీకి చాలా దూరమని నిరూపించాల్సి ఉంటుంది., అలా చేయాలంటే సంచలన నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఏపీలో బీజేపీకి … బీజేపీ అగ్రనాయకులకు జగన్ రెడ్డి అంటేనే అభిమానమని ఎక్కువ అభిప్రాయం ఉంది. అందుకే … ఏపీలో బీజేపీ స్టాండ్ పై బీఎల్ సంతోష్ ఏమి చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది.