అచ్చ తెలుగు పండగ సంక్రాంతి. సంక్రాంతి అంటే తెలుగుదనం. తెలుగు వారసత్వంతో ముడిపడిన ఈ పండగ గురించి ఎన్నో అచ్చ తెలుగు పాటలు వచ్చాయి. అయితే దర్శకుడు అనిల్ రావిపూడి కాస్త వెరైటీగా అలోచించాడు. దాదాపు ఇంగ్లీష్ లిరిక్స్ తో ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాలో ఓ పాటని డిజైన్ చేశారు. బ్లాక్ బస్టర్ పొంగల్ పేరుతో ఈ పాటని రిలీజ్ చేశారు.
డిజే స్టయిల్ లో పాటని కంపోజ్ చేశాడు బీమ్స్. ట్యూన్ క్యాచిగా వుంది. రామజోగయ్య దాదాపుగా ఇంగ్లీష్ లో సాహిత్యం రాశారు. ‘గొబ్బియల్లో’ ని ఎత్తుకొని సింగ్ థిస్ మెలోడీ, బెసికలీ,..టెక్నికలీ, లాజికలీ, ప్రాక్టికలీ, అండ్ ఫైనలీ.. ఇట్స్ ఏ యాటిట్యూడ్ పొంగల్, ఇట్స్ బ్లాక్ బస్టర్ పొంగల్.. ఇలా సాగాయి లిరిక్స్.
వెంకటేష్ తో పాటు బీమ్స్, రోహిణి ఎనర్జిటిక్ గా పాడారు. వెంకీ డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి. కలర్ ఫుల్ సెట్ లో సంక్రాంతి వైబ్ ని ప్రజెంట్ చేస్తూ సాంగ్ ని షూట్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాలో రెండు పాటలకి మంచి రీచ్ వచ్చింది. ఇప్పుడు వెంకీ పాడిన ఈ పాట కూడా ట్రెండ్ కి పట్టే ఛాన్స్ వుంది. జనవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.