రక్తాన్ని ఇష్టపూర్వకంగా దానం చేస్తే దాన్ని రక్తదానం అంటారు. బలవంతంగా తీసుకుంటే.. దాన్ని రక్తం పిండుకోవడం అంటారు. ఏపీ సీఎం జగన్ జన్మదిన వేడుకల కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ ఆవిష్కరించి.. అందులో పేర్లు నమోదు చేసుకోవాలని.. విద్యార్థులు.. పథకాల లబ్దిదారులపై వాలంటీర్లు … అదే పనిగా ఒత్తిడి తెస్తున్నారు. కొంత మంది పేర్లను బహిరంగంగానే… బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించేశారు. ఇదేం తీరు అని.. మాజీ ఎంపీ హర్షకుమార్ లాంటి వాళ్లు కూడా ఫైరవుతున్నారు. ఇలా రక్తదానం చేయించుకోవడం చరిత్రలో లేదని సెటైర్లు వేస్తున్నారు.
జగన్ కోసం జనం ప్రాణమిస్తున్నారని చెప్పుకోవడానికి వైసీపీ తహతహలాడుతోంది. ఇందు కోసం లక్షల సంఖ్యలో జనం రక్తం ఇచ్చేందుకు ముందుకు వచ్చారని.. జగన్ పై అమితమైన ప్రేమ చూపుతున్నారనిప్రచారం చేసుకోవాలనుకుంటున్నారు. అయితే ఇందు కోసం టార్గెట్లు పెట్టుకుని మరీ రక్తదానానికి రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. నిజానికి స్వచ్చందంగా పిలుపు ఇస్తే కార్యకర్తలు.. పదవులు పొందిన వారు కొంత మంది వచ్చి రక్తం ఇస్తారు. ఎంత మంది ఇచ్చారు అనేది ఎప్పుడూ రికార్డు కాదు.
ఎ సామాజిక సేవ చేసినట్లు అవుతుంది కానీ దీనని కూడా.. వైసీపీ తమ నాయకుడి ఇమేజ్ కు ముడి పెట్టుకుంది. అదిగొప్పగా ఉందని చెప్పుకోవడానికి బలవంతపు రక్తదానానికి ప్రయత్నిస్తోంది. విద్యార్థులు.. పథకాల లబ్దిదారులే ఈ ప్రక్రియలో ఎక్కువగా రక్తం కోల్పోతున్నారు. రక్తదానంపై అవగాహన కల్పించి.. దానం చేయిస్తే.. అంతకంటే చేసే మేలు ఉండదు..కానీ బలవంతంగా తీసుకుంటే మాత్రం అదోమరకలా ఉండిపోతుంది. సీఎం జగన్ బర్త్ డే బాష్‌లో ఇదే హైలెట్ అవుతోంది.