ఓ వ్యక్తిని ఇంట్లోనే రెండు రౌండ్లతో కాల్చి చంపేశారు. అదీ కూడా గోదావరి జిల్లాల్లో. ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో ఇలాంటి హత్యలు కూడా జరుగుతున్నాయా అని జనం ఆశ్చర్యపోయారు. చనిపోయిన వ్యక్తి ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తారని ఆ గొడవల్లోనే హత్య జరిగిందని నిందితుల్ని ఇంకా పట్టుకోకముందే… అనుమానితులు ఎవరో తెలుసుకోక ముందే పోలీసులు ప్రకటించేశారు. పోలీసులు ఇలాంటి నేరాల్ని ఎంత తేలికగా తీసుకుంటున్నారో ఈ మాటలతో స్పష్టమవుతుంది.
ఇలాంటివి ఇదే మొదటి సారి కాదు. ఇటీవలి కాలంలో పెరిగాయి. ఓ టీడీపీ నేతను ప్రసాదం ఇస్తామని స్వాముల దుస్తుల వచ్చి నరికేసిన ఘటన ఇంకా కళ్ల ముందే ఉంది. ఇలాంటివి అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. గోదావరి జిల్లాలు ప్రశాంతంగా ఉంటాయి. ఫ్యాక్షన్ తరహా గొడవల వరకూ అసలు పోరు. కానీ కొత్త రాజకీయ సంస్కృతి, నేరాల సంస్కృతి శరవేగంగా విస్తరిస్తోంది. మంత్రి ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టిన ఘటన కూడా జరిగింది. ఆ కేసులన్నీ ప్రభుత్వం ఎత్తివేయడం కొసమెరుపు.
గోదావరి జిల్లాల్లో పోలీసులు రాజకీయ కారణాలతో చాలా వరకూ సైలెంట్ గా ఉంటున్నారు. పొలిటికల్ పనులే చేస్తున్నారు. ఈ కారణంగా నేరస్తులకు భయం లేకుండా పోయింది. రాజకీయ కుట్ర కోణం ఉన్న హత్యలకు అడ్డే లేకుండా పోతోంది. ఫలితంగా గోదావరి జిల్లాలకు ఉన్న ప్రశాంతత కూడా తగ్గిపోతోంది.