మంగళగిరిలో లోకేష్‌పై గెలిస్తే.. ఆళ్లకి మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. కానీ ఇవ్వలేదు. అలాగే చిలకలూరిపేటలో ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకపోయినా.. అక్కడ విడదల రజనీని గెలిపిస్తే.. మర్రి రాజశేఖర్ ను మంత్రిని చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. కానీ జగన్ ఇవ్వలేదు. వారెవరూ నోరు మెదపడం లేదు. జగన్ ఎలాంటి హామీ ఇవ్వకపోయినా.. ఓ వ్యక్తి మాత్రం తనకు డిప్యూటీ సీఎం పోస్టు ఇవ్వాల్సిందేనని.. డిమాండ్ చేస్తున్నారు. కుుటంబంతో కలిసి స్వీయ నిర్బంధం చేసుకున్నారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం.
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో బీసపు శ్రీనివాసరావు అనే వ్యక్తి కుటుంబం స్వీయ నిర్బంధం చేసుకుంది. రెండేళ్లుగా వారు బయటకు రావడం లేదు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో నుంచి బయటకు రావడమే మానేశారు. చాలా రోజుల పాటు ఎవరూ పట్టించుకోలేదు కానీ.. ఇరుగుపొరుగు వారు ఈ పరిస్థితి చూసి భయపడి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి.. బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తే.. ససేమిరా అంటున్నారు. తనకు జగన్మోహన్ రెడ్డి ఉప మఖ్యమంత్రి ఇస్తేనే బయటకు వస్తానని.. ముఖ్యమంత్రి జగన్ తనను కలవాలని డిమాండ్ చే్సతున్నారు. శ్రీనివాసరావు భార్య కూడా తన భర్త మాట జరగాలని చెబుతోంది.
ఉన్న శ్రీనిసరావు మానసిక స్థితి అంత బాగా లేదని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. వారి ఇంట్లో వారి బతుకేదో వారు బతుకుతున్నారన్న చందంగా ఎవరూ వీరిని పట్టించుకోవటం లేదు. స్కూలుకి వెళ్లే పిల్లలను కూడా బడిమాన్సించేసి తమతో ఇంటికే పరిమితం చేసేశారు. శ్రీనివాసరావు భార్య కూడా గుమ్మం దాటి బయటకు రారు. పోలీసులు వారితో మాట్లాడితే రాజకీయ పరమైన డిమాండ్లే వినిపిస్తున్నాయి. రాజకీయంగా మీడియాలోనూ..సోషల్ మీడియాలోనూ జరిగిన ప్రచారం వారి మైండ్‌పై తీవ్ర ప్రభావం చూపి.. .. వారు.. అలా తయారయ్యారన్న అభిప్రాయం.. మానసిక నిపుణుల్లో ఏర్పడుతోంది. వారు ఏమైనా అఘాయిత్యం చేసుకుంటారేమోనన్న ఆందోళనలో పోలీసులు ఉన్నారు.