మలయాళం చిత్రం `లూసీఫర్`ని రీమేక్ చేయాలన్నది చిరంజీవి ఆలోచన. రైట్స్ కూడా చిరు దగ్గరే ఉన్నాయి. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరన్న విషయంలో టాలీవుడ్ అంతా ఆసక్తికరమైన చర్చ నడిచింది. వినాయక్, బాబీ లాంటి పేర్లు వినిపించాయి. చివరికి సుజిత్ సెట్ అయ్యాడు. `సాహో`తో సుజిత్ డీలా పడినా, తన స్టైలీష్ మేకింగ్ రామ్ చరణ్‌కి నచ్చింది. `లూసీఫర్` కూడా స్టైలీష్ గా తీయాల్సిన సినిమానే. అందుకే సుజిత్‌కి ఓకే చెప్పారు. లాక్ డౌన్‌కి ముందే.. ఈ బాధ్యత సుజిత్ కి అప్పగించారు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది.
ఈ రీమేక్ కోసం బాగా వినిపించిన మరో పేరు బాబీ. జై లవకుశ, వెంకీ మామ సినిమాలతో ఫామ్‌లోకి వచ్చాడు బాబీ. ఈమధ్య బాబి – చిరంజీవి మధ్య భేటీ జరిగింది. బాబీ చెప్పిన కథ చిరంజీవికి బాగా నచ్చింది. `దీన్ని డెవలెప్ చేయ్. తప్పకుండా చేద్దాం` అని చిరంజీవి బాబికి మాట ఇచ్చినట్టు తెలుస్తోంది. నిజానికి పవన్ కోసం కూడా బాబీ ఓ కథ రెడీ చేశాడు. ఆ కథకీ ఈ కథకీ సంబంధం ఉందా. రెండూ వేర్వేరు కథలా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. మొత్తానికి బాబీ మెగా కాంపౌండ్ లో ఓ సినిమా చేయడం ఖాయంగా కనిపిస్తోంది.