విజయనగరం జిల్లా బోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు జీఎంఆర్‌కే అప్పగించాలని.. ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జీఎంఆర్ సంస్థకు.. విమానాశ్రయల నిర్మాణం..నిర్వహణలో చాలా అనుభవం ఉంది. ఇందులో సందేహించాల్సిన పని లేదు. ఆ సంస్థ పకడ్బందీగా నిర్మాణాలు పూర్తి చేస్తుంది. నిర్వహిస్తుంది. కానీ.. వైసీపీ పెద్దలు .. అప్పుడు.. ఇప్పుడు వ్యవహరించిన విధానంపైనే… అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే..గత ప్రభుత్వం కూడా.. జీఎంఆర్‌కే..బోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులు ఇవ్వాలనుకుంది. కానీ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్.. ఆయనకు చెందిన మీడియా… అది ఓ భారీ స్కాం అని బీభత్సంగా ప్రచారం చేసేశాయి.
గత ఏడాది మార్చిలో ప్రభుత్వం బోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి జీఎంఆర్‌కు బిడ్స్‌ను ఖరారు చేసింది. వెంటనే సాక్షి పత్రికలో.. వరుసగా కథనాలు ప్రచురించారు. భారీ ముడుపుల కోసమే చంద్రబాబు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ.. బిడ్స్ ఆమోదించారని.. ఆరోపించారు. జీఎంఆర్ కు ఇవ్వడం… ప్రజాధనాన్ని దోపిడీ చేయడమేనని తేల్చారు. అధికారులు సహా అందరూ వ్యతిరేకించారని… ప్రభుత్వానికి లాభదాయకత కాదని సాక్షి పత్రిక తేల్చింది. ఆ కాంట్రాక్ట్‌ను.. జీఎంఆర్ కు ఇవ్వడానికి అధికారులు సిద్ధంగా లేరని.. వారిపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చి మరీ .. ఇచ్చేయాలని చూస్తున్నారని కూడా రాసుకొచ్చారు.
అప్పటి ప్రతిపక్షం.. ప్రతిపక్ష పార్టీకి చెందిన సాక్షి చేసిన ఆరోపణలన్నీ అలా ఉండగానే.. ఇప్పుడు.. జీఎంఆర్‌కు.. ప్రభుత్వం.. కాంట్రాక్ట్ ఇస్తూ.. కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం చూస్తే.. అప్పట్లో చంద్రబాబు…తీసుకోవాలనుకున్న భారీ ముడుపులన్నీ.. ఇప్పుడు వైసీపీ నేతలు తీసుకునేందుకు సిద్ధమయినట్లే భావించాల్సి ఉంటుందన్న విమర్శలు వస్తున్నాయి. అప్పటి ప్రభుత్వంపై ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రతీ విషయంలోనూ ఆరోపణలు చేయడం.. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్నే కొనసాగించడం కామన్‌గా మారిపోయింది. ఆ అవినీతి ఆరోపణలన్నింటికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నా.. స్పందించడం లేదు.