తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా అధికార వైయస్సార్సీపి ఇతర ప్రాంతాల నుండి దొంగ ఓట్లు వేయించడానికి జనాలను భారీగా తరలించింది అంటూ దాదాపు అన్ని ఇతర పార్టీలు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశాయి. అయితే ఈ వ్యవహారం పై బిజెపి నేత సునీల్ దియోధర్ ట్విట్టర్ వేదికగా స్పందించగా, దానికి ఆసక్తికరమైన రిప్లై ఇచ్చారు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ. వివరాల్లోకి వెళితే…
తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్సిపి పెద్ద ఎత్తున వేరే ప్రాంతాల నుండి దొంగ ఓటర్లను తరలించిందనే రిపోర్టులు తనకు వచ్చాయని, వీటిని పరిశీలిస్తున్నామని, సంబంధిత విభాగాలకు ఫిర్యాదు చేశామని, అయినా ఈ స్థాయిలో ఎన్నికల అవకతవకల అరాచకాలు చూడడం ఇదే మొదటి సారి అని సునీల్ దియోధర్ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.
Since morning, getting many complaints about outside voters being brought into #TirupatiByPoll LS area & they are being hidden in various locations & now they’re voting.
Forwarded to GO, PO & RO.
They must check the truth & take immediate action.
Will follow up after polling too.— Sunil Deodhar (@Sunil_Deodhar) April 17, 2021
అయితే సునీల్ దియోధర్ వ్యాఖ్యలపై ట్విట్టర్లోనూ, అదే విధంగా టీవీ డిబేట్లో ను స్పందించారు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ. అధికార వైఎస్ఆర్సిపి చేస్తున్న అక్రమాలను చూసి సామాన్యులు ఆశ్చర్యపోతే పర్వాలేదు కానీ, సునీల్ దియోధర్ వంటి వ్యక్తులు సైతం అదే రకంగా స్పందించడం సబబు కాదని, పూర్తిస్థాయి ఆధారాలు ఉన్నాయి కాబట్టి బలమైన చర్యలు తీసుకునే విధంగా సునీల్ దియోధర్ రియాక్షన్ ఉండాలి తప్పించి, కేవలం మీడియా ముఖంగా ఖండిస్తే సరిపోదని బొలిశెట్టి సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
Sir, We, as people of Andhra Pradesh won't appreciate your comments like an ordinary man.. it's time for BJP and Union Govt to restore the democracy in AP.#TirupatiByElection #JanaSena#JSPForNewAgePolitics #JspBjpAlliance #SaveDemocracy https://t.co/AY02gGUPAi
— Bolisetty Satyanarayana (@bolisetti_satya) April 17, 2021
గత కొంత కాలంగా బిజెపి నేతలు కొందరు ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్ఆర్సిపి తో కుమ్మక్కు అయ్యారు అన్న ఆరోపణల నేపథ్యంలో జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో అక్రమాల ఫిర్యాదుల పై కేంద్ర ఎన్నికల కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.