నందమూరి బాలకృష్ణ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి ఈ సంక్రాంతికి రావడానికి శరవేంగంగా సిద్ధమవుతోంది. ఆడియోఫంక్షన్ అవ్వగానే క్రిష్ ముంబై వెళ్లిపోయాడు. అక్కడే దగ్గరుండి గౌతమి పుత్ర శాతకర్ణి పోస్ట్‌ప్రొడక్షన్ పనులు చూసుకొంటున్నాడు. జనవరి 3కి ఫస్ట్‌కాపీ సిద్ధం అవ్వాల్సిందే. అందుకోసం యుద్ధ ప్రాతిపదికపై పనులు జరుగుతున్నాయి. చిరంతన్ భట్ ఆర్.ఆర్ అందించడంలో బిజీగా ఉన్నాడు. అతనికి తోడుగా మరో ఇద్దరు బాలీవుడ్ సంగీత దర్శకులు ఈ సినిమా కోసం పని చేస్తున్నారని తెలుస్తోంది. చేతిలో టైమ్ పెద్దగా లేకపోవడం వల్ల ఈసినిమాని బిట్లు బిట్లుగా విడగొట్టి.. కొంతమంది బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లకు అప్పగించారట. దానికి వాళ్లు ఆర్.ఆర్ ఇస్తున్నారు. బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ చిత్రాలకు నేపథ్య సంగీతం అందించిన సంగీత దర్శకులు.. ఆర్.ఆర్లోదిట్ట అనిపించుకొన్న వాళ్లు గౌతమి పుత్రకి సంగీతం అందిస్తున్నారని తెలుస్తోంది.
బాజీరావు మస్తాని ట్యూన్లు, ఆర్.ఆర్ గౌతమిపుత్ర కోసం వాడారన్న విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. క్రిష్ మరికొంతమంది సంగీత దర్శకుల సాయం చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకొంది. కేవలం చిరంతన్ భట్ పై ఒత్తిడి తగ్గించేందుకే క్రిష్ ఈ నిర్ణయం తీసుకొన్నాడని తెలుస్తోంది. పైగా యుద్ధ సన్నివేశాలకు ఆర్.ఆర్ చాలా కీలకం. ఆ విషయంలో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని క్రిష్.. అలాంటి సన్నివేశాల్ని తీర్చిదిద్దడంలో ఆరి తేరిపోయిన వాళ్ల చేతిలకే.. ఈ సినిమాని అప్పగించారట. సో.. గౌతమి పుత్ర ఆర్.ఆర్ అదిరిపోవడం ఖాయం.