‘టైగర్ నాగేశ్వరరావు’తో పాన్ ఇండియా ప్రయత్నం చేశాడు మాస్ మహారాజ్… రవితేజ. అయితే అది నెరవేరలేదు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కాకపోతే రవితేజ శ్రమ వృధా కాలేదు. రవితేజకు బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. అక్కడో మల్టీస్టారర్ లో నటించే ఆఫర్ అందింది. ఈ మేరకు ఓ అగ్ర నిర్మాణ సంస్థ రవితేజతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. రవితేజ కూడా ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తికరంగానే ఉన్నాడు. రవితేజకు ఇది వరకు కూడా బాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చాయి. అయితే రకరకాల కారణాల వల్ల వాటిని చేయలేకపోయాడు. ఈసారి మాత్రం బాలీవుడ్ కి వెళ్లాలని గట్టిగా అనుకొంటున్నాడు. బాలీవుడ్ కూడా.. తెలుగు హీరోలపై ఓ కన్నేసింది. అక్కడ మల్టీస్టారర్ చిత్రాల హడావుడి ఎక్కువగా ఉంటుంది. ఇద్దరు బాలీవుడ్ హీరోలు కలిసి నటించడం కంటే, ఓ హిందీ హీరో, ఓ తెలుగు హీరో కలిసి చేస్తే ఆ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ ఉంటుందని భావిస్తున్నారు. అందుకే `వార్ 2` లాంటి ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయి. ఇలాంటి కాంబినేషన్లు త్వరలోనే మరిన్ని చూసే అవకాశం ఉంది.