నాగార్జున హోస్ట్ చేస్తున్న తెలుగు బిగ్ బాస్ షోలో మరో స్పెషల్ ఎట్రాక్షన్. ఈ షోలో బాలీవుడ్ స్టార్స్ సందడి చేయనున్నారు. వారే రణబీర్ కపూర్, అలియా భట్. బాలీవుడ్ లో విడుదలకు సిద్దమౌతున్న బడా చిత్రం బ్రహ్మస్త్ర. దాదాపు మూడు వందల కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో రణబీర్ కపూర్ తో పాటు అమితాబ్ బచ్చన్, అలియా భట్, డింపుల్ కపాడియా, మొనీ రాయ్.. ఇలా భారీ తారాగణం నటించింది.
మరో విశేషం ఏమిటంటే.. ఈ సినిమాలో నాగార్జున కూడా కీలక పాత్ర పోషించారు. పురావస్తు నిపుణుడుగా కనిపించనున్నాడు నాగ్. ఈ సినిమా ప్రమోషన్స్ లో బాగంగా రణబీర్, అలియా హైదరాబాద్ వస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ కూడా ఎంట్రీ ఇచ్చి షో వేదికగా బ్రహ్మస్త్ర ని ప్రచారం చేయనున్నారు. నాగ్ కీలక పాత్ర పోషించడంతో ఇది నాగ్ సినిమాగా కూడా ఇక్కడ ప్రమోట్ చేయలనే ఆలోచన వుంది. మొత్తానికి ఒక టాలీవుడ్ షో లో రణబీర్,అలియా లాంటి స్టార్స్ కనిపించడం చాలా అరుదు. ఇప్పుడు బ్రహ్మస్త్ర తో అది కుదిరింది. ఒక షోలో ఇటు నాగ్ అటు రన్బీర్, అలియా.. ఒకే సినిమా గురించి చెప్పడం, ఆ షోకి నాగ్ హోస్ట్ కావడం.. ఇవన్నీ తెలుగు బిగ్ బాస్ కి ఓ కొత్త కళ తీసుకొస్తాయని చెప్పాలి.