ప్రభాస్ – మారుతి కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇప్పుడు ప్రభాస్ సినిమా అంటే పాన్ ఇండియా స్థాయిలోనే తీయాలి. అందుకు తగినట్టు నటీనటుల్ని సాంకేతిక నిపుణుల్నీ ఎంచుకోవాలి. మారుతి కూడా అదే చేస్తున్నాడు. ప్రభాస్ కోసం పాన్ ఇండియా స్టార్స్‌ని దిగుమతి చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఓ కీలకమైన పాత్ర కోసం బొమన్ ఇరానీని ఎంచుకున్నారని తెలుస్తోంది. మరో పాత్ర కోసం తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబుని తీసుకొచ్చారని తెలుస్తోంది. యోగిబాబు ఇప్పటి వరకూ నేరుగా ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. యోగిని తీసుకురావడం కచ్చితంగా ప్లస్ పాయింటే అవుతుంది. మారుతి కామెడీ టైమింగ్ బాగుంటుంది. తన సినిమాలకు అదే బలం. ఇక యోగిబాబు లాంటి వాళ్లు తోడైతే… ఆ సన్నివేశాలకు మరింత బలం వస్తుంది. వీళ్లే కాకుండా మారుతి సినిమాల్లో రెగ్యులర్‌గా కనిపించే రావు రమేష్, ప్రవీణ్, సప్తగిరి, వెన్నెల కిషోర్.. వీళ్లంతా కనిపించబోతున్నారు. ఈ సినిమాని మారుతి తన స్టైల్ లోనే ఓ ఫన్ రైడ్ మూవీగా తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే కథ సిద్ధమైంది. త్వరలోనే ప్రభాస్‌కి ఫైనల్ నేరేషన్ ఇవ్వబోతున్నాడు. ప్రభాస్ కాల్షీట్లని బట్టి, షూటింగ్ షెడ్యూల్ ఖాయం కానుంది.