ఒకే ఒక్క సినిమాతో క్లాస్ డైరెక్టర్ అనిపించుకొన్నాడు భాస్కర్. తీసిన బొమ్మరిల్లు సినిమానే అతని ఇంటి పేరైపోయింది. తీస్తే ఇలాంటి సినిమా తీయాలి.. అని ఓ పదేళ్ల పాటు చెప్పుకొనేలా ఓ గొప్ప సినిమా తీశాడు. ఆ తరవాత వచ్చిన పరుగు కూడా ఓకే అనిపించింది. ఆరెంజ్ నిరాశ పరిస్తే… ఒంగోలు గిత్తతో భాస్కర్‌పై పెట్టుకొన్న ఆశలు అంచనాలు మటాష్ అయిపోయాయి. ఆ తరవాత కనీసం భాస్కర్ పేరు పలవరించడానికి సైతం నిర్మాతలు కంగారు పడ్డారు. బెంగళూరు డేస్ తమిళ రీమేక్ తెరకెక్కించిన భాస్కర్‌కి ఆ సినిమా కూడా.. హ్యాండిచ్చింది. ఇక బొమ్మరిల్లు భాస్కర్ పేరుని మర్చిపోతున్న తరుణంలో ఇప్పుడో బంగారం లాంటి ఆఫర్ వచ్చింది.
గీతా ఆర్ట్స్ సంస్థ చుట్టూ భాస్కర్ కొంత కాలంగా ఓ స్క్రిప్టు పట్టుకొని తిరుగుతున్నాడు. అది ఎట్టకేలకు ఓకే అయినట్టు టాక్. ఈ కథ బన్నీకీ, అల్లు అరవింద్‌కీ బాగా నచ్చేసిందట. ప్రస్తుతం ఓ స్టార్ హీరోని పట్టుకొనే ప్రయత్నంలో ఉన్నారు. నాగచైతన్య రేంజు ఉన్న హీరోతో ఈ సినిమా చేస్తే బెటరన్నది అల్లు అరవింద్ ఆలోచన. భాస్కర్ పేరు చెబితే హీరోలంతా సైడ్ అయిపోతారు. కాకపోతే తీస్తోంది గీతా ఆర్ట్స్ కాబట్టి టైమ్ట్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. సో.. భాస్కర్ ఈజ్ బ్యాక్ అన్నమాట. హీరో దొరికితే.. ఈ కాంబోకి సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ త్వరలో వచ్చే అవకాశాలున్నాయి.