పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లో రూల్ ఆఫ్ లా అమలు చేయడం లేదని.. సాక్షాత్తూ హైకోర్టు డీజీపీని పిలిచి .. క్లాస్ పీకిన సమయంలో కూడా… అదే తరహా చర్యలు కొనసాగుతున్నాయి. మాచర్లలో బుద్దా వెంకన్న, బొండా ఉమ, న్యాయవాది కిషోర్ల పై హత్యాయత్నం చేసిన తుర్క కిషోర్ అనే వైసీపీ యువజన నేతను.. పోలీసులు ఇలా అరెస్ట్ చేసి అలా వదిలి పెట్టారు. కారుపై.. ఓ పెద్ద దుంగతో కిషోర్ దాడి చేస్తున్న దృశ్యాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీనిపై స్పందించినట్లుగా డీజీపీ చెప్పుకొచ్చారు. ఐజీని మాచర్లకు పంపినట్లు కూడా వివరించారు. ఇంత చేసి సాయంత్రానికి ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లుగా వివరించారు. నిజానికి అరెస్ట్ చేయలేదు.. అరెస్ట్ చూపించారు. ప్రధాన నిందితుడు తుర్క కిషోర్ కు వెంటనే స్టేషన్ బెయిల్ ఇప్పించి పంపేశారు.
ఆయన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి చైర్మన్ అయిపోదామని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ నేతలపై దాడి చేయడంతో ఆయనకు అడ్వాంటేజ్ వచ్చినట్లయింది. ఓ ఎమ్మెల్సీ, మరో మాజీఎమ్మెల్యేనే చంపడానికి ప్రయత్నించిన కిషోర్‌ను.. పోలీసులు అతి చిన్న నేరంగా భావించి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేయడం.. కలకలం రేపుతోంది. ఆయనను మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓట్లేయకుండా భయభ్రాంతులను చేయడానికి ఉపయోగించుకుంటారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సహజంగా.. ఎన్నికల సమయంలో.. ఇలాంటి హత్యాయత్నాలు చేసిన వారిని పోలీసులు వెంటనే.. అరెస్ట్ చేస్తారు. కోర్టులో హాజరు పరుస్తారు.
ఎన్నికలయ్యే వరకూ.. లోపలే ఉంచుతారు. కానీ మాచర్లలో మాత్రం దానికి భిన్నంగా జరుగుతోంది. పోలీసుల పని తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్న సమయంలో సంచలనం సృష్టించిన ఓ హత్యాయత్నం ఘటనలో… ఇలా స్టేషన్ బెయిల్‌పై ప్రధాన నిందితుడ్ని వదిలేసి.. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడానికి అవకాశం ఇవ్వడం… ఆశ్చర్యకరమేని న్యాయవాద వర్గాలు కూడా.. అంటున్నాయి.