✍ దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఘటనకు రాజకీయ రంగు పలుముకుంది. ఇటు అధికార పక్షం, అటు ప్రదాన ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తాజాగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్న తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిని జగనే చంపించాడని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
? ముఖ్యమంత్రి పదవి కోసం కన్న తండ్రినే చంపేశాడని అన్నారు. కృష్ణా జిల్లాలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు తమను కాపాడుతు న్నారంటూ జగన్ ఆరోపిస్తున్నారని… సీఎం తమను ఎలా కాపాడుతున్నారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తాడిపత్రిలోని సాక్షి కార్యాలయం ముందు ఆయన ధర్నాకు దిగారు. తమ కుటుంబం గత కొన్నే ళ్లుగా రవాణారంగంపై ఆధారపడి ఉందన్నారు. న్యాయబద్దంగా, ప్రభుత్వ అనుమతుల మేరకే బస్సులు నడుపు తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదం జరగడం దురదృ ష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
? వాస్తవానికి ఏపీ ప్రతిపక్ష నేత ఎస్ జగన్ కు ఆయనకు సంబందించిన సామజిక వర్గం నుంచి గట్టి మద్దత్తు ఉన్న విషయం తెలిసిందే. ఇటు అధికార ప్రతి తెలుగు దేశంపార్టీకి కూడా చంద్రబాబుకు ఆయన సామాజిక వర్గం నుంచి మంచి సపోర్టే ఉంది. ఈ నేపథ్యంలో ఛాన్సు దొరికినప్పుడల్లా జగన్ అధికార పార్టీ పై విరుచుకుపడిపోతు న్నారు. జగన్ కు చెక్ పెట్టడానికి అతని సామాజిక వర్గానికే చెందిన జేసీ బ్రదర్స్ , ఆనం బ్రదర్స్ ని బాబు రంగం లోకి దించాడు.కృష్ణా జిల్లా జేసీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం తరువాత జెసిసోదరులు కూడా చిక్కుల్లో పడ్డట్లైంది.
? జగన్ ను ఎదుర్కొనడానికి జేసీ సోదరులని బాబు తురుపు ముక్కలుగా భావించాడు. కానీ వారే చిక్కుల్లో పడ్డారు. చంద్రబాబు , జేసీ సోదరుల అక్రమాల వలెనే కృష్ణా జిల్లా బస్సు ప్రమాదం సంభవించిందని వైసిపి విమర్శలు గుపిస్తోంది. మరోవైపు జేసీ సోదరులకు మద్దతుగా తెలుగు దేశంపార్టీ నాయకులు వైసిపి పై కౌంటర్ లు వేస్తు న్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ లకు సంబందించిన అతిపెద్ద రహస్యాలు జేసీ సోదరులకు తెలు సని, వాటిని త్వరలోనే బయటపెడతారని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వైసిపిని హెచ్చరించారు.
బస్సుప్రమాదం లో మరణించిన వారికి జేసీ సోదరులు నష్టపరిహారం అందిస్తారని బోండా ఉమ అన్నారు.
? జేసీ ట్రావెల్స్ గురించి, జేసీ సోదరుల గురించి సాక్షి మీడియాలో వచ్చిన కథనాలకు ఆగ్రహించిన జేసీ ప్రభాకర్, ఆయన కొడుకు ఆవేశంతో ఊగిపోతూ జగన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కావాలంటూ జగన్ పగటి కలలు కంటున్నారని, కానీ ఆయన ఆశలు నెరవేరవని అన్నారు. 2019 ఎన్నికల తర్వాత నేనే ముఖ్య మంత్రి అంటూ రోడ్లపై జగన్ పిచ్చోడిలా తిరుగుతాడని జోస్యం చెప్పారు.
జేసీ సోదరులపై అనవసర రాద్ధాంతం చేయడాన్ని జగన్ మానుకోవాలని సూచించారు. జగన్ కు సీఎం కావాలనే పిచ్చి పట్టింది… అందుకే కలెక్టర్ ఎస్పీలను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తమను చంపేస్తారేమోననని అ న్నారు. చావు విషయంలో రాజకీయాలొద్దని సూచించారు. తాము దీన్ని ఇంతటితో వదిలిపెట్టమని జేసీ హెచ్చ రించారు.
? ఇప్పుడు అందరి దృష్టి జేసీ ప్రభాకర్ రెడ్డి వద్ద ఉన్న ఆ సీక్రెట్ ఏమిటీ అందులో ఏం ఉంది. ఆ సీక్రెట్ తో జగన్ కు ఏమైనా నష్టం వాట్టిలుతుందా అన్న చర్చ సాగుతుంది.