ఒక సినిమా కథలానే అతిలోక సుందరి శ్రీదేవి జీవితం ముగిసిపోయింది. దశాబ్దాల పాటు వెండితెర ఆరాధ్యదేవతగా వెలుగొందిన శ్రీదేవి మరణం యావత్ దేశాన్ని షాక్‌కు గురి చేసింది. బంధువుల వివాహ వేడుక కోసం దుబాయ్ వెళ్లిన ఆమె హోటల్ బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తుపడి తుది శ్వాస విడిచారు. ఆమె హఠాన్మరణం అందరినీ కలిచివేసింది. బాలనటిగా సినీ జీవితం మొదలుపెట్టి సినీ చరిత్రలో తనకంటూ పేజీలు లిఖించుకున్న శ్రీదేవి జీవితంలో ఎన్నో మైళ్ళు రాళ్ళు వున్నాయి.
ప్రస్తుతం నడుస్తున్న బయోపిక్స్ ట్రెండ్ లో శ్రీదేవి బయోపిక్ పట్టాలెక్కితే అది మోస్ట్ అవైటెడ్ అవుతుంది. కానీ తాను బ్రతికుండగా శ్రీదేవి బయోపిక్ కి అనుమతి ఇవ్వని చెబుతున్నారు శ్రీదేవి భర్త బోనీ కపూర్. ఇప్పటికే ఆమె బయోపిక్ కోసం కొందరు ఆయన్ని సంప్రదించారు. కానీ అనుమతి నిరాకరించారు. ఇప్పుడు మరోసారి ఎట్టిపరిస్థితిలో అనుమతి వుండదని కుండబద్దలు కొట్టారు.
శ్రీదేవి వ్యక్తిగత జీవితాన్ని తెరపై చిత్రీకరించడానికి వీలు లేదనేది ఆయన అభిప్రాయం. శ్రీదేవి వ్యక్తిగత జీవితం అంతా చాలా గోప్యంగా జరిగింది. ముంబై వెళ్ళిన తర్వాత కొనేళ్ళు ఆమె పబ్లిక్ లో కనిపించలేదు. పిల్లల్ని కూడా చాలా ప్రైవేట్ గా ఉంచారు. ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమా తర్వాత మళ్ళీ తెరపైకి వచ్చారు. ఆమె మరణంలో కూడా కొన్ని అనుమానస్పద కోణాలు వున్నాయి. పోలీసులు బోనీని కూడా ఈ విషయంలో చాలా లోతుగా విచారించారు. ఒకవేళ ఆమె జీవితంపై తీస్తే ఇవన్నీ ప్రస్థావనకు వచ్చే అవకాశం వుండటంతో బయోపిక్ ససేమిరా వద్దునుకుంటున్నారని అనుకోవాలి.