ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్లో రియల్ భూమ్ తగ్గిపోయిందని చాలా ప్రచారం జరిగింది. ఎన్నికల కారణంగా తగ్గిన రిజిస్ట్రేషన్లను చూపించి అదే సాక్ష్యం అన్నారు. కానీ హైదరాబాద్ రియల్ ప్రగతికి ఎలాంటి ఢోకా లేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ల పెరగడమే కాదు.. హైదరాబాద్లో కొత్త ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున బుకింగ్స్ జరుగుతున్నాయి.
ఇటీవల ప్రధాన రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ వరుసగా.. తమ తమ వెంచర్లను లాంచ్ చేస్తున్నాయి. లాంచ్ రోజునే కనీసం సగం ప్లాట్లను బుక్ చేసుకోవాలన్న లక్ష్యంతో ప్రచార కార్యక్రమాలునిర్వహిసతున్నాయి. వారి అంచనాలు ఏ మాత్రం తగ్గడం లేదు. సగానికిపైగా ప్రాజెక్ట్ లాంచింగ్ రోజునే బుక్ అయిపోతున్నాయి. గత నెల రోజుల్లో రెండు, మూడు సంస్థలు.. ఇలా ప్రాజెక్టుల్ని లాంచ్ చేశాయి. వచ్చే రెండు, మూడు నెల్లలో కనీసం పది హైరైజ్ అపార్టుమెంట్ ప్రాజెక్టుల్ని ఇతర కంపెనీలు భూమి పూజలు చేయబోతున్నాయి.
మరో వైపు మధ్య, చిన్నస్థాయి బిల్డర్లకు ఎంక్వయిరీలు కూడా పెరిగాయి. శివార్లలో ఇండిపెండెంట్ ఇళ్లు నిర్మించే బిల్డర్లు బిజీగా మారిపోయారు. యాభై లక్షల లోపు అపార్టు్మెంట్ల కోసం వెదికేవారు అనేక మంది ఉన్నారు హైదరాబాద్లో ప్రస్తుతం ఇళ్ల కోసం డి్మాండ్ ఎవరూ ఊహించని స్థాయిలో పెరిగిందని.. ఎన్నికల కారణంగా కాస్త మందగించినా… భవిష్యత్ మాత్రం బంగారమేనని నిర్ణయానికి వచ్చారు.
హైదరాబాద్లో పెట్టుబడులు ఎప్పటికీ సురక్షితమేనని.. గట్టిగా నమ్ముతున్నారు వినియోగదారులు. ఓ వైపు నివాసం ఉండటానికి మరో వైపు పెట్టుబడులకూ.. రియల్ ఎస్టేట్ రంగం వైపు చూస్తున్నారు.