మధ్యంతర బెయిల్ గడువు ముగిసినప్పటికీ బోరుగడ్డ అనిల్ జైల్లో లొంగిపోలేదు. దీంతో ఆయన ఇప్పుడు పరారీలో ఉన్నట్లు అయింది. బెయిల్ షరతులు ఉల్లంఘించడంతో ఆయన కోసం పోలీసులు వేట సాగించే అవకాశం ఉంది. అసలు మధ్యంతర బెయిల్ నే తప్పుడు పత్రాలు సృష్టించి తీసుకున్నాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో బోరుగడ్డ అనిల్ వ్యవహారం ఏపీలో సంచలనంగా మారింది. ఆయన ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. తనను చంద్రబాబు, లోకేష్ చంపేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.
బోరుగడ్డ అనిల్ జైల్లో ఉన్న సమయంలో ఆయన తల్లికి అనారోగ్యం చేయడంతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో తన తల్లికి సేవలు చేసుకోవాలని తాను తప్ప.. తన తల్లికి ఎవరూ లేరని ఆయన మధ్యంతర బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత మళ్లీ ఆయన ఇంకా గడువు పొడిగించాలని పిటిషన్ వేశారు. అందు కోసం ఓ వైద్యుడి పత్రం జత చేశారు. ఆ పత్రం నకిలీదని తేలింది. అదే సమయంలో తల్లికి వైద్యం పేరుతో ఆయన బెయిల్ తీసుకుని తల్లి వద్దకు పోలేదని హైదరాబాద్ లో ఉన్నారని గుర్తించారు.
రెండో సారి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు మంగళవారం ముగిసింది. మంగళవారం రోజున ఆయన జైల్లో లొంగిపోకపోతే తీవ్ర నేరం అవుతుంది. అందుకే లొంగిపోతారని అనుకున్నారు.కానీ ఆయన ఏమనుకున్నారో కానీ.. హైకోర్టును కూడా లెక్క చేయకుండా.. పరారీలో ఉన్నారు. ఆజ్ఞాతంలో ఉన్న బోరుగడ్డ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టే అవకాశం ఉంది.