వైసీపీకి చెందిన నేరగాళ్లు అంతా జగన్ మోహన్ రెడ్డిని తండ్రిగా భావిస్తున్నారు. హైకోర్టును సైతం మోసగించిన బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఇప్పుడు ఓ వీడియో రిలీజ్ చేశాడు. జగనే తన తండ్రి అని.. చంద్రబాబు, లోకేష్ తనను చంపేస్తారని చెప్పుకొచ్చారు. తనపై చాలా తీవ్రమైన కేసులు పెట్టారని ఆయన ఆరోపిస్తున్నారు. బెయిల్ రాకుండా చేశారని.. తీవ్రంగా హింసించారని చెప్పుకొచ్చారు. కోర్టులపై తనకు పూర్తి నమ్మకం ఉందని..తాను కోర్టులను మోసగించలేదన్నారు. తన తల్లికి సర్జరీ అయితే చూసుకునేందుకే బెయిల్ తీసుకున్నానని చెప్పుకొచ్చారు.
అయితే బోరుగడ్డ అనిల్ మధ్యంతర బెయిల్ షరతుల్లో కచ్చితంగా పోలీసులకు అందుబాటులో ఉండాలని ఉంది. కానీ పోలీసులకు ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ అందుబాటులో లేరు. ఆయనకు చెందిన ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. తల్లి చికిత్స పొందిన ఆస్పత్రికి మధ్యంతర బెయిల్ పొందిన ఆయన వెళ్లలేదు. రెండో సారి కూడా మధ్యంత బెయిల్ పొందడానికి గుంటూరులో ఓ ప్రముఖ ఆస్పత్రి డాక్టర్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేయడంతో ఆయన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో పోలీసులకూ తెలియడం లేదు.
హైకోర్టును సైతం మోసగించడంతో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో వీడియో విడుదల చేయడం సంచనలంగా మారింది జగనే తన తండ్రి అని చెప్పుకుంటున్నారు కానీ.. ఇప్పటి వరకూ వైసీపీ నేతలెవరూ బోరుగడ్డ అనిల్ తమ పార్టీకి చెందిన వాడని చెప్పడం లేదు. కానీ ఆయన మాత్రం తాను దళితుడ్నని.. జగనే తన తండ్రి అని చెప్పుకుంటున్నారు.