అమెరికాలో హై ప్రోఫైల్ బోస్టన్ బ్రోతల్ స్కాం వ్యవహారం కలకలం రేపుతోంది. ఆ నెట్ వర్క్ చిన్నది కాదు. సీఈవోలు, లాయర్లు, డాక్టర్లు వంటి వారికి మాత్రమే యాక్సెస్ ఉండే బ్రోతల్. అలాంటి వారికి ఇష్టమైన యువతుల్ని సరఫరా చేయడం అంటే చిన్న విషయం కాదు. వారు ఎక్కువగా సెలబ్రిటీలను మాత్రమే ఇష్టపడతారు. ఫలానా సినిమాలో నటి.. ఫలానా సినిమాలో హీరోయిన్ అంటే.. ఎంత పెట్టడానికైనా వీరు సిద్ధపడతారు. గంటకు రూ.50వేలకుపైగా చెల్లించేందుకు వీరు సిద్ధపడ్డాలంటే ఖచ్చితంగా ఆ మహిళలు కూడా ఆ స్థాయికి తగ్గవారే ఉంటారని అనుకోవచ్చు.
ఈ బోస్టన్ బ్రోతల్ స్కాంలో ఉన్న మహిళలు అంతా ఆసియాకు చెందిన మహిళలేనని పోలీసులు చెబుతున్నారు. వివిధ రకాల వీసాల పేరుతో పిలిపించి.. వారితో ఇలాంటి పనులు చేయిస్తున్నారని భావిస్తున్నారు. గతంలో ఇలాంటి బ్రోతల్ వ్యవహారాలు బయటపడినప్పుడు అదే జరిగింది. అయితే అమెరికాలో బ్రోతల్స్ పట్టుబడితే మహిళ పేర్లు బయటకు రావు. ఇప్పుడు కూడా అలాంటి వారి పేర్లు బయటకు రాలేదు. విటుల పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి.
భారత్ కు చెందిన పలువురు సినీ తారలు ఈ బ్రోతల్ ముఠాల ట్రాప్ లో పడ్డారన్న అనుమానాలు చాలా కాలం నుంచి ఉన్నాయి. కొంత మంది వ్యవహారంపై అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ బ్రోతల్ స్కాంలో గ్రాడియంట్ సీఈవో కూడా ఉన్నట్లుగా తేలింది. ఆయన విటుడు మాత్రమే. అసలు వారికి ఆ సేవలు అందించింది ఎవరన్నది మాత్రం బయటకు వస్తే ఇండియాలోనూ సంచలనం అయ్యే అవకాశం ఉంది.