ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీఎన్ రావు కమిటీ నివేదికను.. అసెంబ్లీలో లీక్ చేసినట్లుగానే… బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికను కూడా.. కేబినెట్ సమావేశంలో లీక్ చేశారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ … అమరావతిలో పెట్టే ఖర్చులో పది శాతం.. విశాఖలో పెడితే.. అదే అంతర్జాతీయ నగరం అవుతుందనే నివేదిక ఇవ్వబోతోంది. ఎందుకంటే.. జగన్ ఇదే అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి.
ముఖ్యమంత్రి నోట “పది శాతం” మాట..!
కేబినెట్ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఇదే చెప్పారు. అమరావతిలో పెట్టుబడిపెట్టడం డెడ్ ఇన్వెస్ట్ మెంట్ అని.. అందులో పది శాతం.. విశాఖలో పెడితే చాలన్నట్లుగా మాట్లాడారు. తర్వాత మీడియా సమావేశంలో మంత్రి పేర్ని నాని కూడా.. ఇదే విషయాన్ని అన్యాపదేశంగానైనా.. తన మాటల ద్వారానే చెప్పారు. కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు.. మంత్రులు కూడా… పదిశాతం పెట్టుబడి గురించి పదే పదే చెబుతూండటంతో.. ఇది బీసీజేకు వెళ్తున్న సందేశమో.. లేకపోతే.. ఇప్పటికే వెళ్లిపోయిన సందేశమో అయి ఉంటుందన్న చర్చ జరుగుతోంది.
బోస్టన్ కన్సల్టింగ్ .. రిపోర్టులు అమ్ముకుంటుందని కేసులు..!
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ … మేనేజ్మెంట్ సంస్థ. ఏదైనా కంపెనీలు.. లేదా ప్రభుత్వాలు చేపట్టాలనుకున్న పెద్ద పెద్ద ప్రాజెక్టులపై అధ్యయనం చేసి.. రిపోర్టులు ఇస్తుంది. చాలా దేశాల్లో ఆఫీసులున్నాయి. కానీ ఈ సంస్థపై ఉన్న ఆరోపణలకు లెక్క లేదు. డబ్బులు తీసుకుని కావాల్సినట్లుగా నివేదికలు ఇస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. అనేక దేశాల్లో కేసులు కూడా నమోదయ్యాయి. పోర్చుగీస్‌లో.. ఈ మేరకు.. నమోదైన కేసులు సంచలనం సృష్టించాయి. ఈ కన్సల్టింగ్ కంపెనీలు.. తమ క్లైంట్ల ఇష్టాలను తెలుసుకుని..వాటికి అనుగుణం.. నిపుణుల ముద్ర వేసి.. రిపోర్టులు అమ్ముకుంటాయని.. పలువురు చెబుతున్నారు. గతంలో డెలాయింట్ వంటి సంస్థలతోనే.. తప్పుడు ఆడిట్ రిపోర్టులు ఇప్పించుకున్న ఘనత.. ఆంధ్రప్రదేశ్‌లో కొంత మందికి ఉందని కూడా.. గుర్తు చేస్తున్నారు.
“పది శాతం” అంతగా అచ్చి వస్తుందా..?
టెన్ పర్సంట్.. ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. పది శాతం కమిషన్ తీసుకుని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక ఇస్తుందో లేదో తెలియదు కానీ.. అమరావతిలో ఎంత పెట్టుబడి పెట్టాలో.. అందులో పది శాతం అమరావతిలో పెట్టాలని చెప్పబోతోందని అందరూ అంటున్నారు. అసలు ఈ పది శాతమే… ఎందుకు ఉంటే… దానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయనే సెటైర్లు కూడా రాజకీయవర్గాల్లో పడుతున్నాయి. మొత్తానికి రానున్న రోజుల్లో ఈ టెన్ పర్సంట్.. హాట్ టాపిక్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.