తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌పై ఇరు రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు ఉమ్మడిగా దాడి చేయడంలో ఆంతర్యమేమిటో అంతు పట్టడం లేద. అందులోనూ జాతీయంగా పూర్తి విరుద్ధమైన కాంగ్రెస్ బిజెపి పార్టీలు రెండూ దాడికి ఆధ్వర్యం వహించడం విశేషంగా వుంది. తరచూ టిడిపి ప్రభుత్వంపై దాడి చేసే విష్ణు కుమార్ రాజు మార్పుకోసం గవర్నర్‌పై విల్లు ఎక్కుపెట్టారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లును తక్షణం ఆమోదించి ఎపి బిల్లుపై మాత్రం ఆరాలు అడిగి ఆలస్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మరో వంక టిబిజెపి శాసనసభా పక్ష నేత కిషన్‌రెడ్డి మరో వైపున మంద కృష్ణ మాదిగ విడుదల కోసం గవర్నర్ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. కెసిఆర్ ప్రభుత్వాన్ని పొగడితే సరిపోతుందా అని ఆక్షేపించారు. ఇక తాజాగా టి కాంగ్రెస్ నేతలు సర్వే సత్యనారాయణ ఉత్తమ కుమార్‌రెడ్డి మల్లు రవి తదితరులు బృందంగా గవర్నర్‌ను కలిసి ఇసుక దందా చేసిన మరో హత్యతో సహా వివిధ సమస్యలు దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా నరసింహన్ ప్రభుత్వంతో సహకరించాల్సిన అవసరాన్ని చెప్పగా మీరు గవర్నరా లేక టిఆర్ఎస్నాయకులా అని సూటిగా దాడి చేశారు. ఆయన కూడా అలాగే స్పందించినట్టు సమాచారం. సోనియా గాంధీ నియమిస్తే మీరు బిజెపి టిఆర్ఎస్లకు వంత పాడుతున్నారని కాంగ్రెస్ వారు ఆగ్రహించారట. మొత్తంపైన బాగా వేడి పెరిగింది. పదిహేను నిముషాల తర్వాత మళ్లీ సర్దుబాటు చేసుకుని బయిటపడ్డారు. ఏమైనా గవర్నర్‌పై వేడి పెరుగుతున్నది మరి.. రెండుచోట్ల వివిధ పార్టీల నుంచి