ఆంధ్రప్రదేశ్ రాజధానిపై శాసనమండలిలో ప్రభుత్వం రోజుకో సమాధానం ఇస్తోంది. శాసనమండలి సభ్యులు లిఖితపూర్వకంగా అడిగిన ప్రశ్నకు… శుక్రవారం.. అమరావతిని తరలించడం లేదన్న సమాధానాన్ని పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ లిఖితపూర్వకంగా పంపారు. రాజధాని మార్చే ఉద్దేశం ఉందా.. ఎమ్మెల్సీలు ప్రశ్నలు అడిగారు. అలాంటి ఉద్దేశం లేదని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే.. అంతకు ఒక్క రోజు ముందే.. మరో సభ్యుడు హైకోర్టును కర్నూలుకు తరలిస్తారా.. అని అడిగిన ప్రశ్నకు.. నిపుణుల కమిటీ నియమించామని.. ఆ కమిటీ నివేదిక మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
రాజధాని అంటే పాలనా వ్యవస్థలన్నీ భాగమని.. మొత్తంగా ఏం చేయాలన్న దానిపై నిపుణుల కమిటీ వేశామని చెప్పారు. ఒక్క రోజులోనే.. ప్రభుత్వం రాజధానిని మార్చే ఉద్దేశం లేదని.. మరో సమాధానం ఇచ్చింది. నిజానికి.. ప్రభుత్వం నోట … ఇంత వరకూ రాజధానిని మార్చబోమనే మాట రాలేదు. కానీ మారుస్తామన్నట్లుగా.. రకరకాల ప్రచారాలు చేశారు. చివరికి రిటైర్డ్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలో ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ… అధికార వికేంద్రీకరణ పేరుతో…. పలు చోట్ల పలు వ్యవస్థలు పెట్టాలన్న సూచనలు చేస్తుందని చెబుతున్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం అమరావతిని రాజధానిగా గుర్తించింది.
పొలిటికల్ మ్యాప్ లో పెట్టింది. ఉభయసభల్లో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నల్లో .. ఏపీ రాజధాని అమరావతినేనని.. సంబోధించారు. కానీ ఆ మాత్రం క్లారిటీ ఏపీ సర్కార్ నుంచి రాలేదు. తొలి సారి మండలిలో అలాంటి సమాధానం వచ్చింది. అయితే.. జీఎన్ రావు కమిటీ నివేదిక గురించే బయట ప్రభుత్వం పదే పదే చెబుతోంది. కాబట్టి.. ఆ నివేదిక .. ఆ నివేదికపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే ఫైనల్.